ఈ మధ్య 'అను' పాపల టైమ్ అస్సలు బాగాలేదు... 

టాలీవుడ్ లో తళుక్కున మెరిసి తెరమరుగైన తారలు ఎందరో ఉన్నారు.అయితే ఇందులో కొందరికి సరైన అవకాశాలు రాకపోవడం, మరి కొందరు వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోక పోవడం వంటివి ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు.

 Latest Newsabout Anupama Parameswaran And Anu Emmanuel-TeluguStop.com

అయితే 2016వ సంవత్సరంలో  తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన అను ఇమ్మాన్యుయేల్ ఈ మధ్య కాలంలో అస్సలు కనిపించడం లేదు.నాని సరసన నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈమె తన తర్వాతి సినిమాల్లో ప్రేక్షకులను అంతగా మెప్పించలేక పోయిందని చెప్పాలి.

అయితే మధ్య మధ్యలో పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో నటించినా ఆ సినిమాలు కాస్త ప్లాప్ కావడంతో ఈ అమ్మడు ఆశలకు గండి పడినట్లు తెలుస్తోంది.గత సంవత్సరంలో వచ్చిన శైలజ రెడ్డి అల్లుడు కూడా నిరాశ పర్చడంతో తీవ్ర డిప్రెషన్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.

 Latest Newsabout Anupama Parameswaran And Anu Emmanuel-ఈ మధ్య అను’ పాపల టైమ్ అస్సలు బాగాలేదు… -Movie-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఇదే సంవత్సరంలో టాలీవుడ్ పరిశ్రమలోకి అఆ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మరో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్.ఈమె అక్కినేని నాగ చైతన్య సరసన ప్రేమమ్, శతమానం భవతి, వంటి చిత్రాల్లో నటించి తనకంటూ కొంత మంది ప్రేక్షకులను సంపాదించుకుంది.అయితే ఈ మధ్య కాలంలో ఈమె నటించిన చిత్రం రాక్షసుడు.అయితే ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలవడంతో అవకాశాలు తగ్గాయని సినీ వర్గాల్లో గుసగుసలు విన్పిస్తున్నాయి.

దీంతో అనుపమ దర్శకత్వం వైఫు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. 

.

#LatestTollywood #Anu Emmanuel #LatestTollywood #LatestTollywood #LatestNews

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు