Rajamouli Sukumar : జక్కన్నకు ఉన్న ఈ అలవాటు సుకుమార్ కి కూడా ఉందా… సరిపోయారు ఇద్దరూ?

ఒకప్పుడు సినిమా ఎంతో మంచి సక్సెస్ అయ్యింది అంటే కేవలం హీరోలకు మాత్రమే క్రేజ్ వచ్చేది కానీ ఆ సినిమా విజయం వెనక ఉన్న డైరెక్టర్లకు పెద్దగా గుర్తింపు ఉండేది కాదు కానీ ప్రస్తుతం అలా కాదు డైరెక్టర్లకి కూడా హీరోలకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది.

ఇలా ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ డైరెక్టర్లుగా కొనసాగుతూ హీరోలతో పాటు సమానంగా రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు.

ఇక సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎంతోమంది టాలెంట్ కలిగినటువంటి కొత్త డైరెక్టర్లు తమ టాలెంట్ చూపిస్తూ పెద్ద ఎత్తున సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు.కానీ ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లు అంటే ఎక్కువగా రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్ వంటి వారి పేర్లు మాత్రమే వినపడేవి.

ఇక ఒకప్పుడు స్టార్ డైరెక్టర్లుగా కొనసాగిన వీరంతా కూడా ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ గా పేరు ప్రఖ్యాతలు పొందారు. రాజమౌళి( Rajamouli ) దర్శకత్వం వహించిన RRR సినిమా అంతర్జాతీయ స్థాయిలో మారుమోగిపోవడంతో ఈయనతో కలిసి హాలీవుడ్ టెక్నీషియన్లు కూడా పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

అంతగా ఈయన పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఇక ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడం విశేషం.

Advertisement

ఇక లెక్కలు మాస్టర్ సుకుమార్ ( Sukumar ) గారు కూడా పుష్ప సినిమా( Pushpa Movie ) తో పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ఇలా పాన్ ఇండియా స్థాయిలో కూడా ఈయన పేరు మారుమోగిపోతుంది.

ఈ విధంగా ఫాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈ డైరెక్టర్ల గురించి తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది.ఇలా స్టార్ డమ్ సంపాదించుకున్నటువంటి ఈ డైరెక్టర్లలో ఉన్నటువంటి కామన్ క్వాలిటీ గురించి నేటిజన్స్ చర్చించుకుంటున్నారు. రాజమౌళి సినిమా చేస్తున్నారు అంటే ప్రతి ఒక్క సన్నివేశం కూడా ఫర్ఫెక్ట్ గా ఉండాలి అనేది ఆయన తపన అందుకోసం ఎన్ని చిత్రహింసలైన పెడతారనేది జగమెరిగిన సత్యం.

ఇలా రాజమౌళి ఆర్టిస్టులను పెట్టే టార్చర్ ఎలాగ ఉంటుందో ఇదివరకు పలువురు సెలబ్రిటీలు చెప్పుకొచ్చారు.

ఇక ఆర్ఆర్ఆర్( RRR ) విషయంలో రాజమౌళి తమని ఎంత టార్చర్ చేశారో ప్రమోషన్లలో ఎన్టీఆర్ చెప్పుకు వచ్చారు అలా రాజమౌళి సినిమా అంటే ఆర్టిస్టులకు ఒక ఆర్మీ క్యాంపు లాంటిదని ఎన్నో రకాల మీమ్స్ కూడా వైరల్ అవుతూ ఉంటాయి.అయితే ఇదే పాడు అలవాటు డైరెక్టర్ సుకుమార్ గారికి కూడా ఉందని తెలుస్తుంది ఈయన కూడా ఒక సన్నివేశం పర్ఫెక్ట్ గా రావాలి అంటే తప్పనిసరిగా నటీనటులు కూడా అలాగే నటించాలని అందుకోసం ఎన్నిసార్లైనా ఓపికగా టేక్స్ తీసుకుంటూ సన్నివేశం ఫర్ఫెక్ట్ వచ్చేవరకు చేస్తూనే ఉంటారట.కొన్నిసార్లు వీరి పిచ్చికి సెలబ్రిటీలు సైతం విసుగుచెంది ఈ క్వాలిటీ పిచ్చి ఏంట్రా బాబు అని విసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పాలి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్12, గురువారం2024
రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

పుష్ప సినిమా విషయంలో ఈయన అల్లు అర్జున్ అలాగే రష్మికను ఎంతో ఇబ్బందులకు గురి చేశారని కూడా పలు సందర్భాలలో వీరు చెప్పుకొచ్చారు.ఇలా రాజమౌళికి ఉన్నటువంటి ఈ అలవాటే సుకుమార్ గారికి కూడా వచ్చిందని చెప్పాలి అయితే వీరిద్దరికీ సినిమా మంచిగా రావాలి అనే తపన ఉంది కాబట్టే వీరిద్దరూ కూడా ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని సక్సెస్ అయ్యారు అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.ఇక రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు సినిమా పనులలో బిజీగా ఉండగా సుకుమార్ మాత్రం పుష్ప సీక్వెల్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు