దళపతి-లోకేష్ సినిమాపై లేటెస్ట్ అప్డేట్.. టైటిల్ ప్రోమో ఎప్పుడంటే?

కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కమల్ హాసన్ తో చేసిన విక్రమ్ సినిమాతో పాన్ ఇండియా వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు.విక్రమ్ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.

 Latest News On Thalapathy 67 Title Announce, Thalapathy 67, Lokesh Kanagaraj, Ka-TeluguStop.com

ఈ సినిమాతో కమల్ హాసన్ కు కూడా సాలిడ్ హిట్ అందింది.విక్రమ్ సినిమాతో పాన్ ఇండియా వ్యాప్తంగా మెప్పించిన లోకేష్ కనకరాజ్ నెక్స్ట్ సినిమాపై ఇప్పుడు అందరిలో ఆసక్తి నెలకొంది.

మరి లోకేష్ నెక్స్ట్ కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన విజయ్ దళపతితో తన నెక్స్ట్ సినిమా ప్రకటించాడు.ఇటీవలే విజయ్ వారిసు సినిమాతో వచ్చి 200 కోట్లకు పైగానే కలెక్షన్స్ అందుకుంది.

సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమాతో మంచి విజయం సాధించడంతో విజయ్ నెక్స్ట్ సినిమాపై అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.మరి లోకేష్ దర్శకత్వంలో ఇప్పటికే మాస్టర్ వంటి బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న విజయ్ ఇప్పుడు రాబోతున్న సినిమా కూడా పక్కా విజయం సాధిస్తుంది అని ఫ్యాన్స్ అప్పుడే ఫిక్స్ అయ్యారు.

Telugu Kamal Haasan, Kollywood, Thalapathy, Trisha-Movie

ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి దీని గురించి ఏదొక వార్త వస్తూనే ఉంది.తాజాగా దళపతి67 సినిమా టైటిల్ విషయంలో ఒక అప్డేట్ వచ్చింది.లోకేష్ విక్రమ్ సినిమా మాదిరిగానే ఈ సినిమా టైటిల్ ను చిన్న ప్రోమోతో అనౌన్స్ చేస్తారు అనే ప్రచారం గట్టిగానే సాగుతుంది.కోలీవుడ్ మీడియా చెబుతున్న ప్రకారం ఈ సినిమా ప్రకటన ఫిబ్రవరి 3న రాబోతుంది అని అంటున్నారు.

Telugu Kamal Haasan, Kollywood, Thalapathy, Trisha-Movie

మరి నిజంగానే ఈ సినిమా టైటిల్ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమేనా కాదా అనేది చూడాలి.కాగా ఈ సినిమాను సెవన్ స్క్రీన్ స్టూడియో భారీ స్థాయిలో నిర్మిస్తుంది.అలాగే త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా 2023 దసరా కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని మేకర్స్ ఫిక్స్ అవ్వడంతో ఈ సినిమా షూట్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండానే స్టార్ట్ చేయనున్నట్టు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube