మంచివాడిపైన ఆశలు పెట్టుకున్న హీరోయిన్...

తెలుగులో కృష్ణ గాడి వీర ప్రేమ గాధ అనే చిత్రంలో న్యాచురల్ స్టార్ నాని సరసన నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన మెహ్రీన్ పిర్జాదా గురించి చెప్పనవసరం లేదు.అయితే తాజాగా ఈ అమ్మడు నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన టువంటి “ఎంత మంచి వాడవురా” అనే చిత్రంలో నటించింది.

 Latest News About Telugu Actress Mehreen Pirzada-TeluguStop.com

ఈ చిత్రానికి శతమానం భవతి ఫేమ్ దర్శకుడు సతీష్ విగ్నేష్ దర్శకత్వం వహించారు.అయితే ఈ చిత్రం ఈనెల 15వ తారీఖున సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది.

గత కొద్దికాలంగా ఈ అమ్మడికి సరైన హిట్ లేకపోవడంతో తెలుగు సినీ పరిశ్రమలో తన కెరీర్ కొంతమేర ప్రమాదంలో పడినట్లు తెలుస్తోంది.అయితే అప్పట్లో కూడా ఇదే పరిస్థితుల్లో ఈమె కొనసాగుతుండటంతో అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన టువంటి  ఎఫ్2 చిత్రం కొంత మేర ఊరట కలిగించింది.

కానీ ఆ తర్వాత వచ్చినటువంటి చాణక్య చిత్రం పరాజయం పాలు కావడంతో మళ్లీ ఈమె కెరీర్ చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది.అయితే ప్రస్తుతం ఈ అమ్మడి ఆశలు మొత్తం ఈ చిత్రంపైనే ఉన్నట్లు తెలుస్తోంది.

Telugu Enthamanchi, Mehreen Pirzada, Mehreenpirzada, Teluguactress-Movie

అయితే ఈమె నటించిన మరో చిత్రం అశ్వద్ధామ కూడా విడుదలకు రెడీ గానే ఉంది.ఈ చిత్రం  ఈ నెల చివరలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు.దీంతో ఈ అమ్మడు ఆశలన్నీ ఈ రెండు చితాలపైనే పెట్టుకున్నట్లు తెలుస్తోంది. 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube