దిశ ఘటన తర్వాత రాష్ట్రంలో రోజురోజుకీ పెరుగుతున్నఅత్యాచారాలు

తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదులో మహిళలపై అత్యాచారాలు రోజురోజుకీ ఎక్కువవుతున్నాయి.దిశ ఘటనలో నిందుతులకు ప్రభుత్వం కఠిన శిక్ష విధించినా మహిళలపై అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. 

 Latest News About Telangana State-TeluguStop.com

అయితే దిశా ఘటన అనంతరం హైదరాబాదులో రోజుకో అత్యాచార కేసు నమోదవుతోంది.మొన్నటికి మొన్న పాతబస్తీలో మతిస్థిమితం సరిగా లేని యువతిపై ముగ్గురు కామాంధులు అత్యాచారం చేసిన ఘటన మరువకముందే 11 ఏళ్ల చిన్నారిపై ముగ్గురు ముగ్గురు కామాంధులు దారుణంగా అత్యచారం చేయడంతో  పాతబస్తీలో నివసించే ప్రజలు తీవ్ర భయబ్రాంతులకు గురవుతున్నారు.

అంతేగాకా ఒంటరిగా ఆడపిల్లలను బయటికి పంపించడానికి భయపడుతున్నారు.అయితే ఇది ఇలా ఉండగా దిశ ఘటన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పలు అత్యాచార కేసులు  నమోదయ్యాయి.ఐతే వాటి సంగతి ఏంటని పలు ప్రజా సంఘాల నాయకులు అధికారులను ప్రశ్నిస్తున్నారు.

Telugu Disha, Disha Telangana, Hyderabad, Telangana-Latest News - Telugu

దిశ ఘటన తరహాలోనే మానస అనే యావతిని తన పుట్టిన రోజునే నిందితులు అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారు.అయితే ఈ విషయం గురించీ ఎవరూ మాట్లాడలేదు సరి కదా కనీసం ఈ ఘటన జరిగినట్లు కూడా కొంతమందికి తెలీదు.మరికొంతమంది అయితే దిశ నిందుతులకి వేసిన శిక్షే మానస ఘటన నిందుతులకి కూడా వెయ్యాలని పలు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

అయితే ఇప్పటి వరకూ పోలీసులు మాత్రం మానస ఘటనపై ఎటువంటి స్పష్టత ఇవ్వడం లేదు.అయితే ఇప్పటివరకూ నమోదైన పలు అత్యాచార కేసుల్లో ఒక్క దిశ కేసులోని నిందుతులకి తప్ప ఒక్కరికి కూడా శిక్ష పడలేదు. 

రాష్ట్రంలో జరిగే అత్యాచార ఘటనలను అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మాత్రం ప్రజలకు కచ్చితంగా ప్రభుత్వంపై నమ్మకం పోతుందని పలువురు రాజకీయ నాయకులు అంటున్నారు.కావున ఎంత వీలైతే అంత తొందరగా మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుని మహిళలకి రక్షణ కల్పించాలని సగటు సామాన్య ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube