వైజాగ్ లో వంద ఎకరాల భూమిని కొన్న టాలీవుడ్ హాట్ యాంకర్...  

One Of The Tollywood Anchor Purchasing Land In Visakhapatnam - Telugu Rashmi Gauthm Purchasing A Land, Rashmi Gauthm Purchasing A Land News, Tollywood, Tollywood Anchor News, Tollywood Anchor Rashmi Gauthm

టాలీవుడ్ లో బుల్లితెరపై ప్రేక్షకులను అలరిస్తున్నటువంటి డీ జోడి మరియు జబర్దస్త్ అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది యాంకర్ రష్మి.ఎందుకంటే కంటెస్టెంట్ లు తమ స్కిట్లు మరియు పెర్ఫార్మెన్స్ లతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంటే రష్మి గౌతమ్ మాత్రం తన అందం అభినయంతో ఈ షోలకి మరింత వన్నె తెస్తుంది.

One Of The Tollywood Anchor Purchasing Land In Visakhapatnam - Telugu Rashmi Gauthm A News

అయితే రష్మి గౌతమ్  పలు రకాల  షోలు మాత్రమే కాక అడపాదడపా సినిమాలు కూడా చేస్తూ తనకంటూ కొంత మంది అభిమానులను సంపాదించుకుంది.

అయితే తాజాగా రష్మి గౌతమ్ కి సంబంధించినటువంటి ఓ వార్త నెట్ లో వైరల్ అవుతుంది.

రష్మి గౌతమ్ తాజాగా రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టినట్లు అంతేగాక ఈ వ్యాపారానికి సంబంధించి విశాఖపట్నం పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఓ వంద ఎకరాల భూమిని కూడా కొనుగోలు చేసినట్లు ఓ వార్త ప్రస్తుతం నెట్లో హల్ చల్ చేస్తోంది.అయితే ఈ విషయంపై నెటిజన్లను బాగానే ట్రోల్ చేస్తున్నారు.

చిన్న చిన్న కామెడీ షోలు, అడపాదడపా సినిమాలు చేసుకునే రష్మి గౌతమ్ కి 100 ఎకరాల భూమిని  కొనే అంత సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.అయితే మరికొందరు మాత్రం రష్మి గౌతమ్ కి మద్దతుగా నిలుస్తున్నారు.

ప్రస్తుతం టాలీవుడ్ లోని కొందరు హీరో హీరోయిన్లు ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే మరో పక్క వ్యాపారాలపై దృష్టి సారిస్తున్నారు. అలాగే రష్మి కూడా ఓ పక్క షోలు ఈవెంట్లు సినిమాల్లో నటిస్తూనే వ్యాపారం చేయడంలో తప్పేముందని అంటున్నారు.అయితే ఇది ఇలా ఉండగా అసలు ఈ వార్తల్లో ఎంత నిజముందో అనేది ఇప్పటికీ తెలియడం లేదు.కాబట్టి యాంకర్ రష్మి గౌతమ్ ఈ వార్తలపై స్పందించేంత వరకు నిజానిజాలు ఏంటనేది తెలియదు.

అయితే మరి యాంకర్ రష్మి ఈ విషయం పై స్పందిస్తుందో లేదో చూడాలి.

తాజా వార్తలు

One Of The Tollywood Anchor Purchasing Land In Visakhapatnam-rashmi Gauthm Purchasing A Land News,tollywood,tollywood Anchor News,tollywood Anchor Rashmi Gauthm Related....