ఆంధ్రప్రదేశ్ లో జనసేన మరో టీడీపీ కాబోతోందా.....?  

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రోజు రోజుకీ వేడెక్కుతున్నాయి.అయితే ఇందులో భాగంగా ఏ పార్టీ ఎప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకుంటుందనేది ప్రస్తుతం రాష్ట్రంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

TeluguStop.com - Latest News About Pawan Kalyan Janasena Party

అయితే ఇది ఇలా ఉండగా ఇప్పటికే జనసేన పార్టీ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడం పై పలువురు నాయకులు జనసేన పార్టీ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

అయితే తాజాగా పవర్ స్టార్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్థాపించిన  జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే.

దీంతో  పలువురు సీనియర్ నాయకులు పవన్ కళ్యాణ్ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.ఇందులో భాగంగా కొంతమంది మొదట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ పై తీవ్ర విమర్శలు చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు వారితోనే పొత్తు పెట్టుకున్నాడని అంటున్నారు.

మరికొందరైతే రాష్ట్రంలో బీజేపీ పార్టీని ఎండగడతామని ఒకప్పుడు శబధం చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఇలా బిజెపి పార్టీ తో పొత్తు పెట్టుకోవడం వలన అతడికి తీవ్ర నష్టమని అంతేగాక దీనివల్ల ఇతర పార్టీలు లాభం చేకూరుతుంది తప్ప తనకు ఉపయోగం ఉండదని అంటున్నారు.

అంతేగాక 2014 వ సంవత్సరంలో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ నీ తెలుగు దేశం పార్టీ కి సపోర్ట్ చేయడం వల్ల తెలుగుదేశం పార్టీ గెలిచింది కానీ జనసేనకి కనీస విలువ  కూడా ఇవ్వలేదు.దాంతో ఈసారి జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ సొంతంగా పోటీ చేసింది.కానీ ఊహించని రీతిలో ఓటమి పాలయింది.

దీంతో భవిష్యత్తుని ముందుగానే ఊహించినటువంటి పవన్ కళ్యాణ్ కూడా తన పార్టీ మనుగడ కోసం భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నాడని రాజకీయ వర్గాలు కోడై కూస్తున్నాయి.

అయితే ఇది ఇలా ఉండగా రాష్ట్రంలోని తెలుగు దేశం పార్టీ ఇదే రీతిలో ఎన్నికల్లో బరిలోకి దిగిన ప్రతిసారి ఎవరితో ఒకరితో పొత్తుపెట్టుకుని గెలుస్తూ వస్తుంది.

ఇందుకు ఉదాహరణగా 2014లో జరిగే జరిగినటువంటి ఎన్నికలను చెప్పవచ్చు.అయితే పవన్ కళ్యాణ్ కూడా అదే బాటలో ఉన్నట్లు తెలుస్తోంది.

దీంతో పలువురు రాజకీయ విశ్లేషకులు ప్రస్తుత రాజకీయ పరిణామాలు చూస్తుంటే జనసేన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ లాగానే ముందుకు పోతోందని ఇది భవిష్యత్తులో చాలా ప్రమాదకరమని సూచిస్తున్నారు.

#JanasenaParty #PawanKalyan #JanasenaParty #Janasena Party #Pawan Kalyan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు