మళ్ళీ ప్రేమలో పడ్డ నయన్... ఈసారైనా...  

Latest News About Nayanthara And Vignesh Love Story-nayanthara,nayanthara And Vignesh Love Afire News,nayanthara And Vignesh Love News,nayanthara Love Story,nayanthara News,tollywood

టాలీవుడ్ కోలీవుడ్ సినీ పరిశ్రమలో అగ్ర కథానాయికల్లో నటి నయనతార ముందు వరుసలో ఉంటుంది.ఈమె నటన పరంగా ఇప్పటికే పలు లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటించి సినీ విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది.

Latest News About Nayanthara And Vignesh Love Story-Nayanthara Nayanthara Afire Story Tollywood

దీంతో దాదాపుగా ఈ రెండు చిత్ర పరిశ్రమలోని ప్రముఖ హీరోల అందరి సరసన నటించింది ఈ అమ్మడు.అయితే సినీ జీవితం పరంగా మంచి నిర్ణయాలు తీసుకుంటూ ప్రతిష్ఠాత్మక చిత్రాల్లో నటించే అవకాశాలు దక్కించుకున్న ఈ అమ్మడు తన వ్యక్తిగత జీవిత భాగస్వామి విషయంలో మాత్రం సరైన నిర్ణయం తీసుకోలేక పోతుంది.

ప్రస్తుతం నయనతార మరియు తమిళ దర్శకుడు విగ్నేష్ తో ప్రేమాయణం సాగిస్తున్న సంగతి తెలిసిందే.అయితే గత కొద్ది కాలంగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోయారన్న వార్తలు నెట్టింట్లో బాగానే వినిపిస్తున్నాయి.

తాజాగా ఈ అమ్మడు ఈ వార్తలన్నీ పటాపంచలు చేస్తూ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో  తాజాగా విగ్నేష్ తో సన్నిహితంగా దిగినటువంటి ఫోటోని పోస్ట్ చేసింది.దీంతో నయనతార లవ్ బ్రేక్ అప్ అయిందని వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పడింది.

అయితే ఫోటోలపై నెటిజన్లు  కామెంట్లు చేస్తున్నారు.ఇందులో కొందరు ఇంకా ఎన్ని రోజులని ఇలా ప్రేమాయణం అంటూ జీవితాన్ని వృధా చేసుకుంటున్నావు.

ఎప్పుడు పెళ్లి చేసుకుంటావని ప్రశ్నిస్తున్నారు.మరికొందరైతే కొత్త బాయ్ ఫ్రెండ్ ని ఎప్పుడు పరిచయం చేస్తామని సెటైరికల్ కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఈ కామెంట్లను నయనతార అసలు పట్టించుకోవడం లేదు.అంతేగాక మనం రోడ్డు మీద వెళుతుంటే అనవసరం అయినటువంటి వ్యక్తులు బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని అవన్నీ పట్టించుకోకుండా ముందుకు సాగాలని సూచిస్తోంది.

అయితే ఇది ఇలా ఉండగా తాజాగా ఈ అమ్మడు నటించిన టువంటి దర్బార్ చిత్రం మంచి హిట్ అయ్యింది.ప్రస్తుతం నయనతార  నందమూరి బాలకృష్ణ నటిస్తున్న టువంటి ఓ  టాలీవుడ్ చిత్రంలో లో హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నాడు.

తాజా వార్తలు

Latest News About Nayanthara And Vignesh Love Story-nayanthara,nayanthara And Vignesh Love Afire News,nayanthara And Vignesh Love News,nayanthara Love Story,nayanthara News,tollywood Related....