ఇప్పట్లో ఇంక మహేష్ సినిమా లేనట్లేనా....?  

Latest News About Mahesh Babu New Movie Update - Telugu Mahesh Babu, Mahesh Babu And Vamshi Pydipalli Movie News, Mahesh Babu Movie Update, Mahesh Babu News, Vamshi Pydipalli Latest Movie News

తాజాగా టాలీవుడ్ ప్రిన్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు నటించినటువంటి చిత్రం సరిలేరు నీకెవ్వరు.ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు.

Latest News About Mahesh Babu New Movie Update - Telugu Mahesh Babu, Mahesh Babu And Vamshi Pydipalli Movie News, Mahesh Babu Movie Update, Mahesh Babu News, Vamshi Pydipalli Latest Movie News-Latest News-Telugu Tollywood Photo Image

అయితే భారీ అంచనాల నడుమ సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన టువంటి ఈ చిత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.అంతేకాక ఇతర దేశాల్లో పలు నాన్ బాహుబలి రికార్డులు కూడా బద్దలు కొట్టి మహేష్ తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు.

అయితే గత కొద్ది కాలంగా మహేష్ బాబు తన తదుపరి చిత్రంపై ఎటువంటి క్లారిటీ ఇవ్వడం లేదు.దీంతో పలు రకాల వార్తలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.

ఇందులో ముఖ్యంగా ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లితో చేయాల్సిన టువంటి చిత్రం స్క్రిప్ట్ లో మార్పులు, చేర్పులు కారణంగా ఆగిపోయినట్లు తెలుస్తోంది.అంతేకాక ఈ విషయంలో మహేష్ కి, దర్శకుడు వంశీ పైడిపల్లి కి మధ్య కొంత చెడిందని ఇప్పటికే సోషల్ మీడియా వర్గాలు కోడై కూస్తున్నాయి.

దీంతో మహేష్ ప్రముఖ దర్శకుడు పరశురామ్ తో సినిమా చేసేందుకు సముఖంగా ఉన్నట్లు సమాచారం.

అంతేగాక ఈ చిత్రం మార్చి నెల నుంచి చిత్రీకరణ కూడా జరుపుకుంటున్నట్లు పలు కథనాలు బలంగా వినిపిస్తున్నాయి.అయితే ఈ వార్తల పై దర్శకుడు పరశురామ్ స్పష్టత ఇచ్చేంత వరకూ ఎంత నిజం అనేది తెలియదు.కాబట్టి ఇప్పటికైనా దర్శకుడు పరుశురాం మహేష్ సినిమాపై క్లారిటీ ఇస్తాడో లేదో చూడాలి.

తాజా వార్తలు

Latest News About Mahesh Babu New Movie Update-mahesh Babu And Vamshi Pydipalli Movie News,mahesh Babu Movie Update,mahesh Babu News,vamshi Pydipalli Latest Movie News Related....