Salaar : లియో వర్సెస్ సలార్.. లియో మూవీ సంచలన రికార్డ్ ను ప్రభాస్ బ్రేక్ చేయడం కష్టమేనా?

పాన్ ఇండియా హీరో ప్రభాస్ తాజాగా నటించిన చిత్రం సలార్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

 Latest News About Leo Movie Salaar Movie-TeluguStop.com

ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ టీజర్ పోస్టర్లు సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి.ఈ సినిమా కోసం ప్రభాస్( Prabhas ) అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

కాగా 22వ తేదీ విడుదల కాబోతున్న ఈ సినిమాకు ఓవర్సీస్ బుకింగ్ ఇప్పటికే మొదలయ్యాయి.దీంతో ప్రపంచ దేశాల్లో ప్రభాస్ ఫ్యాన్స్ తమ అభిమాన హీరో సినిమా టికెట్లు బుక్ చేసుకుంటున్నారు.

Telugu Dunki, Leo, Prabhas, Prashanth Neel, Salaar, Tollywood, Vijay-Movie

ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించి ఒక సరికొత్త చర్చ మొదలయ్యింది.ఏమిటంటే దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ లియో ఓవర్సీస్ ఓపెనింగ్స్ ను సలార్ బ్రేక్ చేసే అవకాశాలు లేవంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.అందుకు రకరకాల కారణాలను చెబుతున్నారు.సలార్ విడుదల వాయిదాకు ముందుతో పోలిస్తే ఇప్పుడు సినిమాపై కాస్త ఇంట్రెస్ట్ తగ్గిందని అంటున్నారు.అందుకే బాహుబాలి 2, ఆర్ఆర్ఆర్, లియో రేంజ్ లో ఓవర్సీస్ ఓపెనింగ్స్ జరగకపోవచ్చు అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.ఓవర్సీస్ లో తమిళ స్టార్ హీరో దళపతి విజయ్( Vijay ) నటించిన లియో మూవీ 8.1మిలియన్ల ఓపెనింగ్స్ సాధించింది.

Telugu Dunki, Leo, Prabhas, Prashanth Neel, Salaar, Tollywood, Vijay-Movie

అంత మొత్తంలో తొలి రోజు వసూలు చేసి కోలీవుడ్ తొలి చిత్రంగా రికార్డు సృష్టించింది.నాన్ రాజమౌళి సినిమా రికార్డ్ ఓపెనర్ గా నిలిచింది.బాహుబలి-2 10 మిలియన్లకు తొలిరోజు వసూలు చేయగా ఆర్ఆర్ఆర్ 8.5 మిలియన్లు రాబట్టింది.అయితే ప్రభాస్ సలార్ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఒక్క రోజు ముందు అంటే డిసెంబర్ 21న బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన డుంకీ సినిమా( Dunki ) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.షారుక్ గత రెండు చిత్రాలు వెయ్యి కోట్ల రూపాయల వసూళ్లను సాధించిన నేపథ్యంలో ఈ చిత్రం పై కూడా అంచనాలు అదే స్థాయిలో ఉన్నాయి.

ముఖ్యంగా ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ రాజ్‌ కుమార్ హీరాని దర్శకత్వం వహించడం వల్ల అంచనాలు మరిన్ని పెరిగాయి.దీంతో సలార్ కు డుంకీ కచ్చితంగా గట్టి పోటీ ఇస్తుందని సినీ వర్గాల్లో టాక్.

ఆ ప్రభావం కూడా సలార్ ఓపెనింగ్స్ పై పడుతుంది టాక్.మరి సలార్ సినిమా లియో సినిమా ఓపెనింగ్స్ ని అందుకుంటుందో లేదో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube