ఇండియా మాజీ కెప్టెన్ పై చీటింగ్ కేసు నమోదు....  

Cheating Case Registered Against Former India Captain Azharuddin-azharuddin Cheating,azharuddin Cheating News,azharuddin Latest News,azharuddin News,india Captain Azharuddin,team India

ఒకప్పుడు క్రికెట్ లోకి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుంచి ఒక సాధారణ ఆటగాడిగా వెళ్లి కెప్టెన్ గా ఎదిగి క్రికెట్ బోర్డు కి తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్న టువంటి భారత్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ గురించి పెద్దగా చెప్పనవసరం లేదు.అయితే తాజాగా అజారుద్దీన్ గురించి ఓ వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.

Cheating Case Registered Against Former India Captain Azharuddin-Azharuddin Azharuddin News Latest India Azharuddin Team

అయితే ఆ వార్త ఏంటంటే మహమ్మద్ అజారుద్దీన్ పై ఓ ట్రావెల్స్ సంస్థ అధికారి చీటింగ్ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.ఇందులో భాగంగా ఔరంగాబాద్ కి చెందిన ఓ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థకు చెందిన  షాదాబ్ అనే వ్యక్తి తనను అజారుద్దీన్ మోసం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఇందుకు కారణం ఏమిటంటే గతంలో అజారుద్దీన్ తన సన్నిహితులకు మరియు తనకు వేరే వేరే దేశాలకు తమ ట్రావెల్స్ కంపెనీ ద్వారా టికెట్లు బుక్ చేసుకున్నారు.ఇందుకుగాను మొత్తం దాదాపుగా 20 లక్షల రూపాయలు డబ్బులు అయ్యాయని ఇప్పుడు ఆ డబ్బులు చెల్లించమని అడిగితే అజారుద్దీన్ స్పందించడం లేదని అందుకే అతని పై చీటింగ్ కేసు నమోదు చేశానని షాదాబ్ చెప్పుకొచ్చాడు.

అంతేగాక తనకు న్యాయం చేయాలని అలాగే అజారుద్దీన్ నుంచి డబ్బులు ఇప్పించవలసిందిగా పోలీసులను కోరుతున్నాను.

అయితే  ఈ విషయంపై తాజాగా కెప్టెన్ అజారుద్దీన్ స్పందించాడు.ఇందులో భాగంగా తాను ఎవరికీ డబ్బులు బాకీ లేనంటూ అలాగే తనపై చేస్తున్నటువంటి ఆ ఆరోపణలన్నీ తప్పుడు ఆరోపణలని కొట్టిపారేశారు అజారుద్దీన్.అంతేగాక తనపై ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్న టువంటి ఆ సంస్థ యజమానుల పై పరువు నష్టం దావా వేస్తానని అజారుద్దీన్ చెబుతున్నాడు.

అయితే ఇది ఇలా ఉండగా ఈ విషయమై కేసు నమోదు చేసుకున్న టువంటి పోలీసులు దర్యాప్తులో భాగంగా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ ని విచారించనున్నారు.

తాజా వార్తలు

Cheating Case Registered Against Former India Captain Azharuddin-azharuddin Cheating,azharuddin Cheating News,azharuddin Latest News,azharuddin News,india Captain Azharuddin,team India Related....