ఆ జోడి మళ్లీ రిపీట్ అయితే బొమ్మ బ్లాక్ బస్టర్...

హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ తన పని తాను చేసుకుపోయే హీరోల్లో నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ ఒకరు.గతంలో బాలయ్య బాబు నటించినటువంటి కథానాయకుడు, మహానాయకుడు బాలయ్య బాబు కెరీర్ లోనే పెద్ద డిజాస్టర్లుగా మిగిలాయి.

 Latest News About Balakrishna New Movie-TeluguStop.com

దాంతో బాలయ్య బాబు తాజాగా ప్రముఖ తమిళ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహించిన టువంటి రూలర్ ఈ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.అయితే ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేక పోతోంది.

దీంతో బాలయ్య బాబుకు మళ్లీ నిరాశే ఎదురయింది.

అయితే బాలయ్య బాబు మాత్రం ఇలాంటి ఫలితాలను లైట్ గానే తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

తాజాగా బాలయ్య బాబు తన తదుపరి చిత్రాన్ని  తనతో సింహ, లెజెండ్ వంటి చిత్రాలతో  తనకి హిట్ ఇచ్చినటువంటి బోయపాటి శ్రీనుతో చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.ఇందులో భాగంగా ఇప్పటికే సినిమా ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి.

అయితే ఈ చిత్రంలో సీనియర్ విజయశాంతిని కూడా నటింపజేసేందుకు దర్శక నిర్మాతలు ఇప్పటికే ఆమెను సంప్రదిస్తున్నట్లు సమాచారం.

Telugu Balakrishna, Boyapati Srinu, Vijayashanthi-Movie

అయితే ఇదిలా ఉండగా వెండితెరపై బాలయ్య బాబు విజయశాంతి జోడి తిరుగులేనిది.గతంలో వీరిద్దరూ కలిసి 17 చిత్రాల్లో నటించారు.ఇందులో దాదాపుగా గా అన్ని చిత్రాలు మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకున్నాయి.

అయితే మరోసారి ఈ జోడి వెండితెరపై కనిపిస్తే బొమ్మ బ్లాక్ బస్టర్ అవుతుందని  బాలయ్య అభిమానులు  అభిప్రాయపడుతున్నారు.అయితే మరి బాలయ్య బాబు సినిమాలో నటించేందుకు విజయశాంతి ఒప్పుకుంటుందా లేదో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube