బ్రేకింగ్‌ : బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి విషమం  

Latest Health Bulletin of SP Bala subrahmanyam, SP Charan, Coronavirus, SP Bala subrahmanyam, Chennai, MGM Hospital, Life Support Treat Ment, Sp Balu Health Bulliten - Telugu Chennai, Coronavirus, Life Support Treat Ment, Mgm Hospital, Sp Bala Subrahmanyam, Sp Balu Health Bulliten, Sp Charan

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం దాదాపు నెలన్నర రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.గత నెల 5వ తారీకున కరోనాతో చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో జాయిన్‌ అయిన బాలు గారు రెండు మూడు వారాలు బాగానే ఉన్నా ఆ తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో ఐసీయూలోకి ఆయన్ను మార్చి ఎక్మో మరియు లైఫ్‌ సపోర్ట్‌ ఇచ్చి ట్రీట్‌ మెంట్‌ అందిస్తున్నారు.

TeluguStop.com - Latest Health Bulletin Of Sp Bala Subrahmanyam

నెల రోజులుగా ఆయన ఆరోగ్యం విషయంలో ఆందోళనతో అభిమానులు ఉన్నారు.వారం రోజుల క్రితమే ఆయన తనయుడు ఎస్పీ చరణ్‌ వీడియోలో నాన్న ఆరోగ్యం కుదుట పడిందంటూ చెప్పారు.

మరికొన్ని రోజుల్లో బాలు గారు ఆరోగ్యంగా మారి తిరిగి పాటలు పాడుతారు అనుకుంటూ ఉండగా అనూహ్యంగా ఆయన ఆరోగ్యం బాగా క్షీణించింది అంటూ ఆసుపత్రి అధికారికంగా హెల్త్‌ బులిటెన్‌ ను విడుదల చేసింది.

TeluguStop.com - బ్రేకింగ్‌ : బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి విషమం-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

హఠాత్తుగా బాలు గారి ఆరోగ్య పరిస్థితి విషమించిందని ఆయన్ను ప్రస్తుతం ప్రముఖ వైధ్యుల బృందం పర్యవేక్షిస్తున్నట్లుగా బులిటెన్‌ లో పేర్కొన్నారు.

గడచిన 24 గంటల్లో ఆయన ఆరోగ్యం బాగా క్షీణించింది.లైఫ్‌ సపోర్ట్‌ తో ఆయన ఉన్నారు అంటూ హెల్త్‌ బులిటెన్‌ లో వైధ్యులు ప్రకటించారు.ఈ నేపథ్యంలో ఆయన అభిమానులు మరియు సినీ వర్గాల వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.బాలు గారు కోలుకున్నారు అనుకుంటున్న సమయంలో ఏంటీ మళ్లీ ఈ చేదు వార్త అంటూ అభిమానులు కొందరు కన్నీటి పర్యంతం అవుతున్నారు.

ఆయన త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు దేవుళ్లను ప్రార్థిస్తున్నారు.

#Sp Charan #SPBala #Coronavirus #MGM Hospital #Chennai

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Latest Health Bulletin Of Sp Bala Subrahmanyam Related Telugu News,Photos/Pics,Images..