తెలంగాణ లో మహమ్మారి కరోనా కేసుల లేటెస్ట్ లెక్కలు..!!

ఇటీవల గత కొన్ని రోజుల నుండి తెలంగాణ ప్రభుత్వం కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేయకపోవడంపై హైకోర్టు ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది.దీంతో తాజాగా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్రంలో కరోనా కేసుల హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసింది.

 Latest Figures On Epidemic Corona Cases In Telangana-TeluguStop.com

గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 178 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు తెలిపింది.దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య  2,98,631 కు చేరింది.

 Latest Figures On Epidemic Corona Cases In Telangana-తెలంగాణ లో మహమ్మారి కరోనా కేసుల లేటెస్ట్ లెక్కలు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదే తరుణంలో 148 మంది కోలుకోవడంతో… మొత్తంగా 2,95,059 మంది కరోనా నుండి రికవరీ అయినట్లు సంఖ్య పెరిగింది.ఒకరు ప్రాణాలు కోల్పోవడంతో మొత్తంగా చూసుకుంటే తెలంగాణలో కరోనా వల్ల మృతి చెందిన వారి సంఖ్య 1,633 కి చేరింది.ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా రికవరీ శాతం 97.1 ఉన్నట్లు అదేవిధంగా.యాక్టివ్ కేసులు 1,939  అని హెల్త్ బులిటెన్ లో పేర్కొంది.మరోపక్క తెలంగాణ సర్కార్ కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం కూడా చాలా శరవేగంగా చేస్తూ ఉంది.

#CoronaPositive #Corona Virus #Corona Vaccine #TelanganaHealth

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు