బాలయ్య 'అఖండ' ఈ డేట్ కే రాబోతుందా !

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాను యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్నాడు.

 Latest Buzz On Balakrishna Akhanda Movie Release Date, Balakrishna, Akhanda Movi-TeluguStop.com

ఈ సినిమా ఈ మధ్యనే షూటింగ్ చేసుకుని విడుదలకు సిద్ధం అయ్యింది.ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ అప్పుడు అవుతుంది ఇప్పుడు అవుతుంది అని వార్తలు వస్తూనే ఉన్నాయి.

తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి ఒక డేట్ కూడా ఫిక్స్ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 13 న విడుదల అవ్వబోతున్నట్టు తాజాగా బజ్ ఒకటి వైరల్ అవుతుంది.ఇప్పటికే ఈ డేట్ కి రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమాను ప్రకటించాడు.

అయితే ఆర్ ఆర్ ఆర్ వాయిదా పడుతుంది అని వార్తలు వస్తున్న నేపథ్యంలో బాలయ్య ఈ డేట్ ను లాక్ చేసుకున్నట్టు టాక్.

Telugu Akhanda, Balakrishna, Boyapati Srinu, Dasara Race, Latestbuzz, October, P

మరి త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది.ఇక ఇప్పటికే దసరా రేస్ లోకి అఖిల్ అక్కినేని ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్సినిమా అక్టోబర్ 12న విడుదల అవ్వబోతున్నట్టు ప్రకటించారు.ఈ నేపథ్యంలో బాలయ్య సినిమా కూడా దసరా రేస్ లోకి వస్తే ఈసారి నందమూరి అభిమానులకు, అక్కినేని అభిమానులకు ఫైట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Telugu Akhanda, Balakrishna, Boyapati Srinu, Dasara Race, Latestbuzz, October, P

ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో బాలయ్య డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు.అంతేకాదు జగపతిబాబు కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు.ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, సయేశా సైగల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

మరి చూడాలి అఖండ రిలీజ్ డేట్ ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తారో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube