ఆల‌స్యంగా టీఎస్ ఎంసెట్ ఫ‌లితాలు

తెలంగాణ ఎంసెట్ ఫ‌లితాల విడుద‌ల ఆల‌స్యం కానుంది.ఇంజ‌నీరింగ్, అగ్రిక‌ల్చ‌ర్, మెడిక‌ల్ ఎంట్ర‌న్స్ టెస్ట్ రిజ‌ల్ట్స్ ను వ‌చ్చే వారం ప్ర‌క‌టించ‌నున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ‌ అధికారులు తెలిపారు.

 Late Ts Eamcet Results-TeluguStop.com

ఎంసెట్ లో అగ్రికల్చర్, మెడికల్ విభాగంలో మొత్తం 94,476 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.గత నెల 30, 31వ తేదీల్లో జరిగిన ప్రవేశ పరీక్షకు 80,575 మంది హాజరయ్యారు.

అదేవిధంగా ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షకు 1,72,243 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.గత నెల 18, 19, 20వ తేదీల్లో జరిగిన పరీక్షకు 1,56,812 మంది హాజరయ్యారు.

ఈ క్ర‌మంలో తెలంగాణ ఎంసెట్ ఫలితాలు వచ్చే వారం విడుదలవుతాయి.

అనంత‌రం ఇంజనీరింగ్‌ అడ్మిషన్‌ కౌన్సెలింగ్‌ను జేఈఈ కౌన్సెలింగ్‌కు అనుసంధానం చేశారు అధికారులు.

ఈ కౌన్సిలింగ్ అక్టోబర్ చివరి వరకు కొనసాగనుండ‌గా.నవంబర్ 1 నుంచి క్లాస్‌వర్క్ ప్రారంభం అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube