చనిపోయిన దర్శకుడు సినిమా రిలీజ్ కాబోతుంది... హీరోయిన్ భావోద్వేగం- Late Director Praveen Varma Directorial Super Over Release On Aha

Late Director Praveen Varma Directorial Super Over Release On Aha, Tollywood, naveen chandra, Chandini Chowdary, Sudheer Varma - Telugu @ahavideoin, @harshachemudu, @ichandinic, @naveenc212, @rakendumouliv, @sudheerkvarma, Aha, Chandini Chowdary, Late Director Praveen Varma, Naveen Chandra, Sudheer Varma, Super Over Movie, Tollywood

కొన్ని సినిమాలు షూటింగ్ జరుగుతూ ఉండగా, లేదంటే షూటింగ్ పూర్తయిన తర్వాత సదరు సినిమాలోని నటులు, లేదంటే ఆ దర్శకుడు చనిపోవడం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి.అలాంటి సంఘటనలు చాలా సినిమాలకి జరిగాయి.

 Late Director Praveen Varma Directorial Super Over Release On Aha-TeluguStop.com

మలయాళీ సూపర్ హిట్ మూవీ అయ్యప్పన్ కోషియమ్ సినిమాతో మొదటి ప్రయత్నంలోనే సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు లాక్ డౌన్ సమయంలో అర్ధాంతరంగా గుండెపోటుతో చనిపోయాడు.అలాగే ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన హీరో రెండో సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగా రోడ్డు ప్రమాదంలో మరణించాడు.

అలాగే హిందీలో ఒక సినిమా షూటింగ్ ఫైనల్ షెడ్యూల్ లాక్ డౌన్ వలన వాయిదా పడగా ఆ సినిమాలో కీలక పాత్ర చేసిన రిషి కపూర్ చనిపోయారు.అలాగే తెలుగులో కూడా గేమ్ ఓవర్ అనే సినిమాని తెరకెక్కించిన దర్శకుడు గణేష్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు.

 Late Director Praveen Varma Directorial Super Over Release On Aha-చనిపోయిన దర్శకుడు సినిమా రిలీజ్ కాబోతుంది… హీరోయిన్ భావోద్వేగం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమా షూటింగ్ క్లైమాక్స్ లో ఉండగానే అతని రోడ్డు ప్రమాదానికి గురై కొంత కాలం హాస్పిటల్ లో చికిత్స తీసుకున్న తర్వాత చనిపోయాడు.

టాలెంటెడ్ దర్శకుడు సుధీర్ వర్మకి ప్రవీణ్ వర్మ శిష్యుడు కావడంతో తన అసిస్టెంట్ తెరకెక్కించిన సినిమాని రిలీజ్ చేసే బాధ్యతలని అతనే తీసుకున్నాడు.సూపర్ ఓవర్ టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమాలో నవీన్ చంద్ర, చాందినీ చౌదరీ మెయిన్ లీడ్స్ చేశారు.క్రికెట్ బెట్టింగ్ నేపధ్యంలో నడిచే క్రైమ్ థ్రిల్లర్ మూవీగా దీనిని తెరకెక్కించారు.

ఇక ఈ సినిమా ఆహాలో రిలీజ్ కాబోతుంది.లాక్ డౌన్ తర్వాత మొదలైన ఏఈ సినిమా షూటింగ్ క్లైమాక్స్ షూటింగ్ టైంలో ప్రవీణ్ యాక్సిడెంట్ కి గురై చనిపోయాడు.

అతని జ్ఞాపకంగా ఈ సినిమా రిలీజ్ చేసే బాధ్యతని సుధీర్ వర్మ తీసుకున్నాడు.సినిమా రిలీజ్ సందర్భంగా చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరోయిన్ చాందినీ చౌదరీ దర్శకుడు ప్రవీణ్ ని తలుచుకొని ఎమోషనల్ అయ్యింది.

హీరో నవీన్ చంద్ర కూడా దర్శకుడు ప్రవీణ్ టాలెంట్ గురించి ప్రశంసలు కురిపించాడు.ఈ సినిమాని రిలీజ్ చేసే బాధ్యత తీసుకున్న సుధీర్ వర్మకి థాంక్స్ చెప్పాడు.

#@Naveenc212 #@iChandiniC #@sudheerkvarma #@RakenduMouliV #Sudheer Varma

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు