చిరు అభిమానుల్లో ఆనందం… పుట్టిన జూనియర్!  

Actress Meghana raj gives birth to a baby boy , Meghana raj ,Chiranjeevi Sarja, Chiranjeevi Sarja Son, Baby boy, Chiranjeevi Sarja Fans - Telugu Actress Meghana Raj Gives Birth To A Baby Boy, Baby Boy, Chiranjeevi Sarja, Chiranjeevi Sarja Fans, Chiranjeevi Sarja Son, Meghana Raj

చిరు అభిమానుల్లో ఆనందం వెల్లువెత్తింది… జూనియర్ చిరు పుట్టడం తో అటు అభిమానుల్లో, ఆయన కుటుంబం లో నెలకొన్న ఆనందానికి అవధులు లేకుండా పోయింది.ఇంతకీ చిరు .

TeluguStop.com - Late Actor Chiranjeevi Sarjas Wife Meghana Gives Birth Baby Boy

జూనియర్ చిరు అని ఆలోచనలో పడ్డారా.కన్నడ హీరో చిరంజీవి సర్జా హఠాన్మరణం పొందిన విషయం తెలిసిందే.36 ఏళ్ల వయసులో ఆయన ఉన్నట్టుండి గుండెపోటు రావడం తో ఆకస్మిక మరణం చెంది కన్నడ అభిమానుల గుండెల్లో విషాదాన్ని నింపారు.అతిచిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయిన చిరు సర్జా మళ్లీ పుట్టాలి అంటూ ఆయన అభిమానులతో పాటు కుటుంబసభ్యులు కూడా ఎదురు చూశారు.

చివరికి ఆ రోజు రానే వచ్చింది.చిరు సర్జా సతీమణి, నటి మేఘనా రాజ్ ఆయన మృతి చెందే సమయానికే గర్భవతిగా ఉన్న విషయం తెలిసిందే.ఆయన అకాల మరణం కుటుంబ సభ్యులతో పాటు అభిమానులను తీవ్రంగా కుదిపేసింది.ఆయన మృతి ని తట్టుకోలేకపోయిన ఆయన ప్రతి రూపం మేఘనా గర్భంలో ఉండడం తో ఆమెను కుటుంబ సభ్యులు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చారు.

TeluguStop.com - చిరు అభిమానుల్లో ఆనందం… పుట్టిన జూనియర్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఈ క్రమంలోనే ఇటీవలే ఆమెకు చిరంజీవి సర్జా కటౌట్ సమక్షంలో సీమంతం కూడా చేయడమే కాకుండా, చిరంజీవి సర్జా పుట్టిన రోజు అయిన అక్టోబర్ 17 న జూనియర్ చిరు కు స్వాగతం పలుకుతూ అందరూ కుటుంబ సభ్యుల సమక్షంలో యాక్షన్ కింగ్ అర్జున్ మేఘనా చేతులమీదుగా కేక్ కూడా కట్ చేయించాడు.ప్రతి ఒక్కరూ ఎంతో శ్రద్దగా మేఘనా ను చూసుకుంటూ రాగా, ఆమె తాజాగా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు తెలుస్తుంది.
తమ అన్నయ్యే మళ్లీ పుడతాడు అంటూ ఇప్పటికే చిరంజీవి సర్జా సోదరుడు ధృవ సర్జా బావోద్వేగంతో చెబుతోన్న నేపథ్యంలో మేఘనా పండంటి మగబిడ్డకు జన్మనివ్వడం తో ఆయన కుటుంబ సభ్యులతో పాటు అభిమానుల్లో కూడా ఆనందం ఉప్పొంగింది.అన్నయ్య లేకపోయినా కూడా మేఘనను తల్లిలా చూసుకుంటున్న ధృవ అన్న బిడ్డను చూసి ఆనందం వ్యక్తం చేశాడు.

అయితే ఈరోజే చిరంజీవి సర్జా, మేఘనల ఎంగేజ్ మెంట్ డే అని కూడా సమాచారం.వారిద్దరి ఎంగేజ్ మెంట్ రోజునే జూనియర్ చిరంజీవి సర్జా కి మేఘనా జన్మనివ్వడం విశేషం.

#ActressMeghana #Baby Boy #Meghana Raj

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Late Actor Chiranjeevi Sarjas Wife Meghana Gives Birth Baby Boy Related Telugu News,Photos/Pics,Images..