సంగీత ప్రియులకు సింగర్ లతా మంగేష్కర్ గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు.ఎన్నో పాటలకు ప్రాణం పోసి కొన్ని కోట్ల మందికి ఆరాధ్య గాయకురాలిగా మారింది.70 ఏళ్ల పాటు తన గానంతో ఎంతో మందిని ఆకట్టుకుంది.ఇక అలాంటి గొప్ప గాయని లతా మంగేష్కర్ గురించి ఇప్పుడు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం.
లతా మంగేష్కర్ 13 సంవత్సరాల వయసులో ‘కిటి హస్సల్’ అనే మరాఠీ చిత్రం కోసం ఆమె తొలి సినిమా పాటను రికార్డ్ చేసింది.కానీ ఆ పాటతో అంతగా ఆమె పేరు పొందలేదు.
ఇక ఆమె అదే చిత్రంలో ‘నాచు యా గాదే’ అనే రెండో పాటకు ప్రాణం పోసింది.అలా రెండు పాటల్లో విఫలమైనప్పటికీ ఏ మాత్రం నిరాశ చెందకుండా అలానే ముందుకు సాగింది.
ఇక అలా ప్రేక్షకుల మెప్పు పొందని లతా మంగేష్కర్.మహల్ చిత్రంలో ఆమె పాడిన ‘ఆయేగా అనేవాలా’ అనే పాటతో లతా స్థాయి వేరే రేంజ్ కి వెళ్ళిపోయింది.ఇక ఆ పాటతో సంగీత దర్శకులు అంతా లతా మంగేష్కర్ చుట్టూ తిరగడం మొదలుపెట్టారు.ఇక ఆ క్షణం నుంచి లతా ఏ పాట పాడినా అది అమృతంలా విలపించేది.
ఇక లతా మంగేష్కర్ కి ఇష్టమైన ఆటల విషయానికి వస్తే.లతా కు క్రికెట్ అంటే చాలా ఇష్టం అని తెలిసింది.
ఆమె రాజకీయంగా ఎంపీగా కొంతకాలం పని చేసినప్పుడు కేవలం రూపాయి జీతం మాత్రమే తీసుకునేది అని తెలిసింది.