యాంకర్ లాస్యతో పెళ్లి కోసం అతడు తన భార్యకి విడాకులు ఇవ్వడానికి కూడా…  

Anchor Lasya Manjunath react about unknown person marriage proposal, Lasya Manjunath, Telugu Anchor, marriage proposal, Manunath, Tollywood, - Telugu Anchor Lasya Manjunath React About Unknown Person Marriage Proposal, Lasya Manjunath, Manunath, Marriage Proposal, Telugu Anchor, Tollywood

అప్పట్లో తెలుగులో ప్రముఖ మ్యూజిక్ ఎంటర్ టైన్ మెంట్ చానల్ మా మ్యూజిక్ లో ప్రసారమయ్యే “సంథింగ్ స్పెషల్” అని లైవ్ కార్యక్రమంలో తన గలగల మాటలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన “యాంకర్ లాస్య”  గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఒకప్పుడు తెలుగులో యాంకర్ లాస్య మంజునాథ్  పలు షోలు, ఈవెంట్లతో బాగానే రాణించింది.

TeluguStop.com - Lasya Manjunath React About Unknown Person Marriage Proposal

 అయితే తాజాగా యాంకర్ లాస్య ఆమె భర్త మంజునాథ్ తో ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొంది.

ఇందులో భాగంగా తన సినీ ప్రయాణంలో ఎదుర్కున్న కొన్ని సంఘటనల గురించి ప్రేక్షకులతో పంచుకుంది.

TeluguStop.com - యాంకర్ లాస్యతో పెళ్లి కోసం అతడు తన భార్యకి విడాకులు ఇవ్వడానికి కూడా…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే ఇందులో ముఖ్యంగా తనకి పెళ్లికాక ముందు ఓ ప్రముఖ షోలో యాంకరింగ్ నిర్వహిస్తున్న సమయంలో సినీ పరిశ్రమకు చెందిన ఓ వ్యక్తి తనని పెళ్లి చేసుకుంటానని వెంటపడేవాడని చెప్పుకొచ్చింది.అయితే అప్పటికే ఆ వ్యక్తికి పెళ్లై పిల్లలు కూడా ఉన్నారని అయినప్పటికీ తనకోసం తన భార్యకు విడాకులు ఇవ్వడానికి కూడా ఒకానొక సమయంలో సిద్ధపడ్డాడని దాంతో తాను ఈ విషయంలో కలుగజేసుకుని నాకు పెళ్లి ఇష్టం లేదని సీరియస్ వార్నింగ్ ఇవ్వడంతో ఆ వ్యక్తి కొంతమేర సైలెంట్ అయ్యాడని తెలిపింది.

కానీ తనని పెళ్ళి చేసుకుంటానంటూ వెంట పడిన ఆ వ్యక్తి పేరుని చెప్పడానికి మాత్రం లాస్య మంజునాథ్ ఇష్ట పడలేదు.అలాగే తన భర్త మంజునాథ్ తనని ఎంతో ప్రేమగా చూసుకుంటాడని ఇందులో ముఖ్యంగా మా ఇద్దరి మధ్య అర్థం చేసుకునే గుణం మెండుగా ఉండటంతో ప్రస్తుతం సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తున్నామని  చెప్పుకొచ్చింది.

దీంతో కొందరు నెటిజన్లు యాంకర్ లాస్య మంజునాథ్ ని పెళ్లి పేరుతో వేధించిన ఆ వ్యక్తి ఎవరా.? అంటూ నెట్టింట్లో తెగ వెతుకుతున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా తెలుగులో  లాస్య మంజునాథ్ ఓపక్క పలు షోలు, ఈవెంట్లలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తునే మరో పక్క సినిమాల్లో కూడా అప్పుడప్పుడు నటిస్తూ ప్రేక్షకులని బాగానే అలరిస్తోంది.కాగా ప్రస్తుతం తెలుగులో మంచి గుర్తింపు పొందిన “బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షో 4వ సీజన్లో” కంటెస్టెంట్ గా పాల్గొంటోంది.

#Lasya Manjunath #Manunath #AnchorLasya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Lasya Manjunath React About Unknown Person Marriage Proposal Related Telugu News,Photos/Pics,Images..