కాల గమనంలో 2021 సంవత్సరం కూడా ముగిసింది. 2022 ఏడాది ప్రారంభం అయ్యింది.
గడచిన సంవత్సరం ఎలా ఉన్నా.ఎన్ని ఇబ్బందులు కష్టాలు నష్టాలు వచ్చినా కూడా రాబోయే సంవత్సరం కోసం ఆసక్తిగా ఎదురు చూడటం.
సంతోషంగా ఉంటుందని ఆశించడం మానవ నైజం అనడంలో సందేహం లేదు.ఇప్పుడు టాలీవుడ్ వర్గాల వారు మరియు ప్రేక్షకులు అదే భావిస్తున్నారు.2021 లో కరోనా వల్ల ఎప్పటిలా కాకుండా చాలా తక్కువ శాతం సినిమాలు విడుదల అయ్యాయి.రెగ్యులర్ కంటే కనీసం 70 శాతం తక్కువ సినిమాలు విడుదల అయ్యాయి.
పెద్ద సినిమాలు అయితే 90 శాతం తక్కువ విడుదల అయ్యాయి.విడుదల అయిన కొన్ని సినిమాల్లో సక్సెస్ అయినవి తక్కువ ప్లాప్ అయిన సినిమాలు ఎక్కువ.
ఎప్పటిలాగే టాలీవుడ్ సక్సెస్ శాతం 15 నుండి 20 శాతం మాత్రమే అంటూ 2021 ని విశ్లేషించక తప్పని పరిస్థితి.

2021 డిసెంబర్ చివరి వారం అయిన నిన్న నాలుగు సినిమాలు విడుదల అయ్యాయి.అందులో మూడు సినిమాల గురించి ఎవరికి తెలియదు.నాల్గవ సినిమా అర్జున ఫల్గుణ అట్టర్ ప్లాప్ టాక్ దక్కించుకుంది.
అంతకు ముందు వచ్చిన అఖండ మరియు పుష్ప సినిమాల జోరుకు ఆ సినిమా కనీసం విడుదల అయిన రోజు కూడా ఆకట్టుకోలేక పోయింది.దాంతో 2022 అట్టర్ ప్లాప్ సినిమా తో ఆరంభం అయ్యిందని చెప్పుకోక తప్పని పరిస్థితి.
కరోనా పరిస్థితుల కారనంగా 2021 అంతగా కలిసి రాలేదు.కనీసం 2022 లో అయినా టాలీవుడ్ కు కలిసి వస్తుందా అనేది చూడాలి అనుకుంటున్న సమయంలో వాయిదాల పరంపర కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కరోనా థర్డ్ వేవ్ వల్ల సంక్రాంతి కి విడుదల కావాల్సిన సినిమాల పై నీలి నీడలు కమ్ముకున్నాయి.ఏం జరుగబోతుందా అంటూ అంతా కూడా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.
ఆర్ ఆర్ ఆర్ విడుదల వాయిదా పడితే 2022 లో బ్యాడ్ స్టార్టింగ్ అవుతుంది.