ఈ రోజు ఆస్ట్రేలియా, ఇండియా ఆఖరి వన్డే మ్యాచ్! ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్!  

ఆస్ట్రేలియా, ఇండియా మధ్య ఆఖరి మ్యాచ్ కి వేదిక అయిన ఢిల్లీ. గెలుపు కోసం ఇరు జట్లు ఫైట్. .

  • ప్రపంచంలో రెండు బలమైన జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే కచ్చితంగా ఆసక్తి వుంటుంది. అందులో ఒకటి టీం ఇండియా అంటే ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరో నెల రోజులో ఇంగ్లాండ్ వేదికగా ప్రపంచ కప్ క్రికెట్ జరగనుంది. దీనికి ప్రారంభం అన్నట్లు ప్రపంచ కప్ టైటిల్ కోసం పోటీ పడే రెండు బలమైన జట్లు ఆస్ట్రేలియా, టీం ఇండియా మధ్య ఐదు వన్దేల సిరిస్ కి ఈ రోజుతో తెరపడనుంది. 2-2 విజయాలతో సమయంగా ఉన్న రెండు జట్లు ఎలా అయిన ఈ మ్యాచ్ లో గెలిచి టైటిల్ సొంతం చేసుకోవాలని భావిస్తున్నాయి.

  • చివరిదైన మూడో మ్యాచ్ లో టీం ఇండియా భారీ స్కోర్ చేసిన కూడా బౌలింగ్, ఫీల్డింగ్ ఫైఫల్యం వలన విజయం చేజార్చుకుంది. ఇక ఆస్ట్రేలియా తన కెరియర్ లో అత్యధిక లక్ష్యచేధనతో రికార్డ్ సొంతం చేసుకుంది. ఈ నేపధ్యంలో ఢిల్లీ వేదికగా జరిగే ఈ మ్యాచ్ మీద ఆద్యంతం ఆసక్తి నెలకొని వుంది. అయితే ఆస్ట్రేలియా టీం అంత ఈజీగా సిరిస్ ని జారవిడుచుకునే అవకాశం ఉండదు. అలాగే టీం ఇండియా బౌలింగ్, ఫీల్డింగ్ ఫైఫల్యంతో పాటు కొంత కలవరానికి గురి చేస్తుంది. ఇలాంటి టైం లో విరాట్ సేన ఎంత వరకు విజయం అందుకొని సిరిస్ ని సొంతం చేసుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.