నేటితో సభలకు నమస్కారం ! ఇక దృష్టి మొత్తం దానిమీదే  

Last Day For Election Campaigning-

ఏపీలో హోరాహోరీగా సాగుతున్న ఎన్నికల ప్రచారంతో ఏపీ మొత్తం హోరెత్తతోంది.మొదటి విడత లో జరగబోతున్న ఈ ఎన్నికలపై అందరిలోనూ ఆసక్తి రేగుతోంది.

Last Day For Election Campaigning-

ఇప్పటివరకు సందుల్లో కూడా ఆటోలతో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించిన పార్టీలు తాము అధికారంలోకి వేస్తే ఏమేమి చేయబోతున్నాము అనే విషయాలను ఫోకస్ చేసి మరీ ప్రచారం చేస్తున్నాయి.ఆ విధంగానే ఎక్కడికక్కడ కుల సంఘాల నాయకులతో సభలు, సమావేశాలు పెట్టించి మరీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.

అయితే తొలి విడత ఎన్నికల ప్రచార పర్వం సాయంత్రం 6 గంటలతో ముగిసిపోనుంది.ఈ సందర్భంగా ఎత్తులు పైఎత్తులు, వ్యూహ,ప్రతివ్యూహాలు, ఆసక్తికరమైన సంఘటనలతో సాగిన ప్రచారం ఈ సారి ఉద్రిక్తతలను సృష్టించింది.

Last Day For Election Campaigning-

ఏది ఏమైతేనేం ప్రచార పర్వం మాత్రం ఈ రోజుతో పూర్తయిపోయింది.

ప్రచారం ఘట్టానికి తెరపడడంతో ఇప్పుడు మిగిలింది ప్రలోభాల పర్వమే.

ఇప్పటికే అన్ని రకాలుగా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రధాన పార్టీలన్నీ కాచుకు కూర్చున్నాయి.ఇప్పటికే అదే పనిలో తమ కార్యకర్తలను రంగంలోకి దించింది.

నామినేషన్లకు ముందే అభ్యర్థుల్ని బెదిరించటం, హైదరాబాద్ లోని ఉన్న వారి ఆస్తులపై కన్నేసిన తెలంగాణ నేతలు బెదిరింపులతో రాజకీయాన్ని ఉద్రిక్తం చేశారు.ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేస్తే ఆస్తులు మీకు దక్కవని బెదిరింపులు కూడా మొదలుపెట్టారు.

నెల్లూరులో ఆదాల ప్రభాకర్ రెడ్డి పేరును నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి తొలిజాబితాలో సీఎం చంద్రబాబు ప్రకటించినా ఆయన వైసీపీ ఒత్తిడికి తలొగ్గి అటువైపుకు వెళ్లిపోయారు.ఒంగోలులో మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా వైసీపీ, బీజేపీ నేతల ఒత్తిడి కారణంగా వైసీపీలో చేరిపోయారు.

వైసీపీ అధినేత జగన్ పాదయాత్రల్లో తాను కవర్ చేయని నియోజకవర్గాల మీద దృష్టిపెడతానని చెప్పినప్పటికీ పాదయాత్ర చేసిన నియోజకవర్గాల్లోనే ఎక్కువగా పర్యటించారు.చంద్రబాబును విమర్శించటానికే ఎక్కువ ప్రాధాన్యతను తన ప్రసంగాలలో ఇచ్చారు.

తానొస్తే ఏం చేస్తాననే అనే అంశాన్ని సమర్థవంతంగా చెప్పలేకపోయారు.జగన్ తోపాటు ఆయన సోదరి షర్మిల, ఆయన తల్లి విజయలక్ష్మి కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

చివరి నాలుగైదు రోజుల్లో టీడీపీ ప్రచారం, సానుకూల పవనాలు ఎక్కువగా వీయడంతో వైసీపీ ప్రచారంలో వెనకబడిపోయినట్టు కనిపిస్తోంది.

తాజా వార్తలు