ఆధార్ - పాన్ కార్డు లింక్ కి ఈరోజే చివరి తేది .. ఎలా చేసుకోవాలంటే

చిన్న నుంచి పెద్ద .ప్రతి విషయంలో ఆధార్ లింకేజ్ ని కంపల్సరి చేస్తున్న భారత ప్రభుత్వం, ట్యాక్స్ చెల్లించేవారి విషయంలో ఆధార్ – పాన్ కార్డు లింకేజి తప్పనిసరి చేసిన విషయం విదితమే.

 Last Day For Aadhar – Pan Linkage .. How To Do It ?-TeluguStop.com

ఆ లింకేజి చేసుకోవాల్సిన చివరి తేది ఈరోజే.ఇప్పటికే 2.07 కోట్ల మంది ట్యాక్స్ పెయర్స్ ఈ లింక్ పని పూర్తీ చేసుకున్నారు.దేశంలో 25 కోట్లమంది పాన్ కార్డు హోల్డర్స్ ఉంటే, 111 కోట్ల మంది దగ్గర ఆధార్ కార్డు ఉంది.

మరి మీరు ట్యాక్స్ కట్టేవారే అయితే, ఈ రోజే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీ ఆధార్ కార్డుని మీ పాన్ కార్డుతో లింక్ చేసుకోండి.ఒకవేళ ఎలా చేసుకోవాలి మీకు తెలియకపోతే రెండు పద్ధతులు ఉన్నాయి చూడండి.

మొదటి పధ్ధతి :

* E filing వెబ్ సైట్ లోకి వెళ్ళండి.వెళ్లి ఎడమవైపు ఉన్న Link Aadhar మీడ్ద క్లిక్ చేయండి

* మీ ఆధార్ నంబర్ అలాగే పాన్ కార్డు నంబర్ ఎంటర్ చేయండి

* మీ ఆధార్ కార్డు మీద ఎలాగైతే మీ పేరు నమోదు అయ్యి ఉందొ, అచ్చం అలాగే స్పెల్లింగ్ తప్పు లేకుండా ఎంటర్ చేయండి

* అంతే, ఈ ప్రాసెస్ పూర్తీ.కాసేపటికే మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.

రెండోవ పద్దతి :

ఈ పధ్ధతిలో మీరు పని పూర్తీ చేయాలంటే, ఆధార్ కార్డు మరియు పాన్ కార్డులో మీ పేరు ఒకేలా ఉండాలి.Gonnala Ramesh అని ఓ చోట, G.Ramesh అని మరో చోట ఉంటే కుదరదు.ఇలా ఉంటే లింక్ అవడం కష్టం.ఇక రెండు చోట్ల పేరు ఒకేలా నమోదు అయ్యి ఉంటే ఎలాంటి కంగారు, అనుమానం లేకుండా పని మొదలుపెట్టండి

* UIDPAN అని టైప్ చేసి, స్పేస్ ఇచ్చి, మీ ఆధార్ కార్డు నంబర్ ని ఎంటర్ చేసి, మళ్ళీ స్పేస్ ఇచ్చి పాన్ కార్డు నంబర్ ని ఎంటర్ చేయండి

* ఉదాహరణ : UIDPAN 123456789101 ANWP2312AN

* ఇప్పుడు 567678 లేదా 56161 నంబర్ కి మెసేజ్ పంపండి

* మీ రిజిస్టర్డ్ నంబర్ కి వన్ టైం పాస్ వార్డ్ వస్తే ఎంటర్ చేయండి

* వెరిఫికేషన్ తరువాత మీ ఆధార్, పాన్ కార్డు లింక్ అయినట్టు మెసేజ్ వస్తుంది

నోట్ : ఒకవేళ మీ ఆధార్ లేదా పాన్ కార్డులో ఏవైనా మార్పులు చేయాలి అనుకుంటే, National Securities Depository Ltd (NSDL) లోకి వెళ్లి UIDAI పోర్టల్ లో మార్పులు చేసుకోవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube