సింగరేణి ఉద్యోగాల దరఖాస్తుకు ఈరోజే లాస్ట్ డేట్.. !

ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న విద్యావంతుల కోసం ఇటీవల ఒక ప్రకటనలో సింగరేణి సంస్థలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు సీఎండీ ప్రకటించిన విషయం తెలిసిందే.ఆ నోటిఫికేషన్లో ఆయా పోస్టులకు జనవరి 22 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కూడా పేర్కొంది.

 Today Is The Last Date For Singareni Jobs, Singareni, Jobs, Application, Today L-TeluguStop.com

ఇకపోతే ఈ ఉద్యోగాలకు తగిన అర్హత కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 4 వరకు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.అంటే ఈ రోజే లాస్ట్ డేట్.ఇక ఏయే ఉద్యోగాలు సింగరేణిలో ఉన్నాయో తెలుసుకుంటే.

మొదటగా ఫిట్టర్ ట్రైనీ పోస్టులు 128 ఉన్నాయి.

వీటిలో లోకల్ కేటగిరీలో 105, అన్‌ రిజర్వ్‌‌డ్ కేటగిరీలో 23 ఉండగా, ఎలక్ట్రీషియన్ ట్రైనీ విభాగంలో మొత్తం 51 ఖాళీలను భర్తీ చేయనున్నారు.ఇందులో లోకల్ అభ్యర్థులకు 43, అన్‌ రిజర్వ్‌‌డ్ అభ్యర్థులకు 8 కేటాయించారు.

వెల్డర్ ట్రైనీ విభాగంలో 54 ఖాళీలు ఉన్నాయి.అందులో లోకల్ కు 44 కేటాయించగా, మరో 10 అన్‌ రిజర్వ్‌‌డ్ కు కేటాయించారు.

ఇక మోటార్ మెకానిక్ ట్రైనీ విభాగంలో మొత్తం 14 ఖాళీలు ఉండగా, అందులో లోకల్ 12, అన్‌ రిజర్వ్‌‌డ్-2.టర్నర్ మెషినిస్ట్ ట్రైనీ విభాగంలో మొత్తం 22 ఖాళీలు ఉన్నాయి.

ఇందులో 18 లోకల్ కు కేటాయించగా, అన్‌ రిజర్వ్‌‌డ్ కు 4 కేటాయించారు.

Telugu Foundry, Jobs, Staff Nurse, Machinist, Singareni, Trainee Jobs, Welder-La

ఫౌండ్రీ మ్యాన్, మౌల్డర్ ట్రైనీ విభాగంలో మొత్తం 19 ఖాళీలు ఉన్నాయి.ఇందులో లోకల్ కు 16, అన్‌ రిజర్వ్‌‌డ్ కు 03 కేటాయించారు.ఇక జూనియర్ స్టాఫ్ నర్స్ ఈ విభాగంలో మొత్తం 84 ఖాళీలు ఉన్నాయి.

ఇందులో లోకల్ కు 67 కేటాయించగా, అన్‌ రిజర్వ్‌‌డ్ కు 17 కేటాయించారు.

ఇకపోతే లోకల్ కేటగిరీలోకి ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన అభ్యర్థులు వస్తారు.

కాగా అన్‌ రిజర్వ్‌‌డ్ కేటగిరీలోకి లోకల్, నాన్ లోకల్ అభ్యర్థులు వస్తారు.పైన పేర్కొన్న నాలుగు జిల్లాలతో పాటు తెలంగాణలోని ఇతర ప్రాంతాల అభ్యర్థులంతా నాన్ లోకల్ కేటగిరీలోకి వస్తారని అధికారులు పేర్కొన్నారు.

అయితే జూనియర్ స్టాఫ్ నర్స్ మినహా మిగతా పోస్టులకు పురుషులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.కాగా పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.

ఇకపోతే అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు https://www.scclmines.com వెబ్ సైట్ ఓపెన్ చేసి అందులో Careers లింక్ పై క్లిక్ చేస్తే పూర్తి నోటిఫికేషన్ చూడొచ్చని, దరఖాస్తు దారులు ఫిబ్రవరి 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని.అర్హతలకు సంబంధించిన సాఫ్ట్ కాపీలను కూడా అప్ లోడ్ చేయాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube