హడావిడి గా పరిగెత్తిన ప్రజా ప్రతినిధులు

నామినేషన్లకు చివరి రోజు.ఉదయం 11.30 గంటలు దాటితే సుమూహర్తాలు లేవు.దీంతో కొద్దిసేపటి క్రితం ఏపీ, తెలంగాణ కోటా నుంచి అధికార, మిత్రపక్షాల అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్న అభ్యర్థులంతా ఒకేసారి హైదరాబాదులోని అసెంబ్లీకి చేరుకున్నారు.

 Last Date For Rajya Sabha Nominations-TeluguStop.com

టీడీపీ మిత్రపక్షం బీజేపీ తరఫున బరిలోకి దిగుతున్న కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు… పార్టీకి చెందిన ఏపీ, తెలంగాణ నేతలు, టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు వెంట రాగా అసెంబ్లీకి చేరుకున్నారు.

ఇక టీడీపీ అభ్యర్థులుగా బరిలోకి దిగనున్న సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్… పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వెంట రాగా ఎన్టీఆర్ ఘాట్ లో పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కు నివాళి అర్పించి పాదయాత్రగా అసెంబ్లీకి చేరుకున్నారు.

మరోవైపు తెలంగాణ కోటా నుంచి అధికార టీఆర్ఎస్ అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్న ధర్మపురి శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతారావు… గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించి అసెంబ్లీకి చేరుకున్నారు.వీరంతా మరికాసేపట్లో తమ నామినేషన్లను దాఖలు చేయనున్నారు.

ఒకేసారి ఐదుగురు అభ్యర్థులు నామినేషన్ కు వచ్చిన నేపథ్యంలో ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలతో అసెంబ్లీ ప్రాంగణంలో కోలాహలం నెలకొంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube