వకీల్ సాబ్‌లో పవన్‌ను మరపించనున్న 30

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.దాదాపు రెండేళ్ల తరువాత పవన్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీ రేంజ్‌లో ఉన్నాయి.

 Last 30 Minutes Will Be Extraordinary In Vakeel Saab, Pawan Kalyan, Vakeel Saab,-TeluguStop.com

బాలీవుడ్‌లో సూపర్ సక్సెస్ అయిన పింక్ చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా వస్తుండటంతో వకీల్ సాబ్ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.ఇక ఈ సినిమాలో పవన్ లాయర్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమాలో పవన్ యాక్టింగ్ ఓ రేంజ్‌లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.ముఖ్యంగా సినిమాలోని చివరి 30 నిమిషాలు సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లనున్నట్లు చిత్ర వర్గాల టాక్.

ఈ 30 నిమిషాలలో పవన్ చేసే యాక్టింగ్‌కు జనం ఫిదా అవుతారని, ఈ సన్నివేశాల్లో మనకు కేవలం చిత్రంలోని పాత్రలే కనిపిస్తాయని, పవన్ అసలు కనిపించడని తెలుస్తోంది.చిత్ర యూనిట్ ఇంత ధీమాగా చెబుతుండటంతో పవన్ యాక్టింగ్‌ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్ మూవీగా రానుండటంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.ఇక ఈ సినిమాలో పవన్ సరసన అందాల భామ శృతి హాసన్ నటిస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి కీలక రోల్స్‌లో నటిస్తున్నారు.మరి ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube