కూతురు అలా అడగటంతో అవాక్కైన బాలీవుడ్ హీరోయిన్.. ఏం జరిగిందంటే?

Lara Dutta Spoke About Uncomfortable Coversations With Her Daughter Saira

సినీ నటిగా, మన దేశం నుంచి విశ్వసుందరిగా ఎంపికైన రెండో యువతిగా లారాదత్తా పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.యూపీలోని ఘజియాబాద్ లో 1978 సంవత్సరంలో లారాదత్తా జన్మించారు.

 Lara Dutta Spoke About Uncomfortable Coversations With Her Daughter Saira-TeluguStop.com

లారాదత్తా తల్లి ఆంగ్లో ఇండియన్ కాగా తండ్రి పంజాబ్ కు చెందిన వింగ్ కమాండర్ కావడం గమనార్హం.లారాదత్తా అక్క ప్రస్తుతం వాయుసేనలో పని చేస్తున్నారు.

లారాదత్తా 2000 సంవత్సరంలో ఫెమినా మిస్ ఇండియాగా ఎంపికయ్యారు.

 Lara Dutta Spoke About Uncomfortable Coversations With Her Daughter Saira-కూతురు అలా అడగటంతో అవాక్కైన బాలీవుడ్ హీరోయిన్.. ఏం జరిగిందంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

లారా దత్తా పదుల సంఖ్యలో సినిమాల్లో నటించడంతో పాటు ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు.

టెన్నిస్ చాంఫియన్ అయిన మహేష్ భూపతిని లారాదత్తా వివాహం చేసుకున్నారు.లారా దత్తా మహేష్ భూపతిల కూతురు వయస్సు ప్రస్తుతం 9 సంవత్సరాలు కాగా కూతురు అడిగే ప్రశ్నలు తనను ఎంతగానో ఆశ్చర్యపరుస్తాయని ఆమె తెలిపారు.

తన కూతురు 4 సంవత్సరాల వయస్సులో డైవోర్స్ అంటే ఏమిటని అడిగిందని లారా దత్తా అన్నారు.

ప్రస్తుతం తన కూతురు మరో ప్రశ్న అడిగిందని ఆ ప్రశ్నకు ఏ విధంగా సమాధానం చెప్పాలో తనకు అర్థం కాలేదని ఆమె అన్నారు.

Telugu Saira, Divorce, Hiccupahuccups, Lara Datta, Universe, Tennismahesh, Uncomtable-Movie

కొన్ని రోజుల క్రితం తన కూతురు బ్రోతల్ అంటే ఏంటని ప్రశ్నించిందని అలాంటి పదాలు చిన్నపిల్లల చెవుల్లో పడటం ఆశ్చర్యకర పరిణామం అని ఆమె వెల్లడించారు.అయితే కూతురు ప్రశ్నకు ఏ సమాధానం ఇచ్చారనే విషయాన్ని మాత్రం ఆమె వెల్లడించలేదు.

Telugu Saira, Divorce, Hiccupahuccups, Lara Datta, Universe, Tennismahesh, Uncomtable-Movie

అయితే అలాంటి పదం తన కూతురి చెవిలో పడిన తర్వాత తాను అబద్ధం మాత్రం చెప్పనని ఆమె వ్యాఖ్యలు చేశారు.తాను తన కూతురి జీవితంలో అబద్ధాలు చెప్పే తల్లిగా మిగిలిపోకూడదని ఆమె తెలిపారు.అయితే ఈ విధమైన చర్చలు కొనసాగాలని ఆమె చెప్పుకొచ్చారు.లారాదత్తా తాజాగా హికప్స్ అండ్ హుకప్స్ అనే వెబ్ సిరీస్ చేయగా ఈ వెబ్ సిరీస్ లో టీనేజ్ అమ్మాయికి తల్లిగా లారాదత్తా కనిపించారు.

#Uncomtable #Lara Datta #HiccupaHuccups #Uncomtable #Saira

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube