మాల్యాకి భారీ ఎదురుదెబ్బ! ఇండియాలో అడుగు పెట్టాల్సిందే  

విజయ్ మాల్యాని ఇండియాకి రప్పిస్తున్న కేంద్ర ప్రభుత్వం. .

Landon Court To Give Permission To Arrest Vijay Mallya-economic Fraud,landon Court,modi,permission To Arrest,vijay Mallya

దేశంలో ఆర్ధిక కుంభకోణాలు చాలా జరిగాయి కాని, ఓ కార్పోరేట్ కంపెనీ మాటున బ్యాంకులకి భారీగా కుచ్చుటోపీ పెట్టి విదేశాలకి పారిపోయిన జాబితాలో మొదటి స్థానం లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకి దక్కుతుంది. సుమారు 9 వేల కోట్లు బ్యాంకులకి భాకీ పడి కంపెనీ నష్టాల కారణంగా ఊహించని విధంగా లండన్ పారిపోయి మాల్యా అక్కడ తలదాచుకున్నాడు. అయితే మాల్యా పారిపోవడం వెనుక బీజేపీ హస్తం ఉందనేది కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. .

మాల్యాకి భారీ ఎదురుదెబ్బ! ఇండియాలో అడుగు పెట్టాల్సిందే-Landon Court To Give Permission To Arrest Vijay Mallya

ఇదిలా ఉంటే లండన్లో ఉంటున్న విజయ్ మాల్యా ను ఇండియాకు రప్పించడానికి మన ప్రభుత్వం ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.

లండన్ కోర్ట్ లో మాల్యాపై కేసు కూడా నడుస్తుంది. అయితే అతను బెయిల్ మీద హ్యాపీగా బయట తిరుగుతున్నాడు. అయితే తాజాగా లండన్ కోర్టు అతనికి ఊహించని షాక్ ఇచ్చింది.

మాల్యాను భారత్ కి అప్పగించడానికి ఇంగ్లండ్ హోం మినిస్టర్ సాజిద్ జావిద్ ఈ ఏడాది ఫిబ్రవరి 4న ఆమోదం తెలిపారు.

అయితే ఇప్పటివరకు ఏదో విధంగా తప్పించుకుంటూ వస్తున్న మాల్యాకు మరోసారి భారీ ఎదురు దెబ్బ తగిలింది. భారత్ కు రప్పించే చర్యలకు వ్యతిరేకంగా మాల్యా దాఖలు చేసిన పిటిషన్ ను లండన్ లోని వెస్ట్ మినిస్టర్ కోర్టు సోమవారం తోసిపుచ్చింది. దీంతో ఇప్పుడు భారత్ పోలీసులు మాల్యాని ఇండియాకి తీసుకెళ్ళి ఊచలు లెక్కపెట్టించడానికి అవకాశం దొరికింది. మొత్తానికి ఇన్ని రోజులు దేశాన్ని మోసం చేసి పారిపోయిన మాల్యాకి ఇండియాలో అతిథి మర్యాలు చేయడానికి ఇండియన్ పోలీసులు సిద్ధం అవుతున్నారు.