లంబోర్ఘిని కారుతో ఎన్టీఆర్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసిందే.ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉన్నాడు.

 Lamborghini Urus Graphite Capsule Arrives At Ntr Home Ntr, Tollywood, Lamborghin-TeluguStop.com

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ కు ఉన్న అభిమానం అంతా ఇంతా కాదు.ఈయన సినిమాలు వస్తున్నాయంటే చాలు తెగ ఎదురుచూస్తూ ఉంటారు.

అంతేకాకుండా ఈయన వ్యక్తిగత విషయాల పట్ల కూడా అభిమానులు బాగా ఆసక్తి చూపుతుంటారు.ఇదిలా ఉంటే తాజాగా ఆయన కారుకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారడంతో అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది.

ఇక ఎన్టీఆర్ ఇటీవలే కొత్త కారును కొన్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ఆయన దగ్గర 20కి పైగా కార్లు ఉన్నట్లు సమాచారం.ఎక్కువగా లగ్జరీ కార్లను ఇష్టపడుతాడు ఎన్టీఆర్.ఇక తను కొనే కారులకు కూడా ఫ్యాన్సీ నెంబర్లు వచ్చేలా మాత్రమే చూసుకుంటాడు.

ఇటీవలే మంచి ఫీచర్లు కలిగిన లంబోర్ఘిని ఉరస్ గ్రాఫైట్ క్యాప్యూల్ లగ్జరీ కారును కొనగా దానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

Telugu Lamborghini Car, Car, Ntr, Ramcharan, Srikanth, Tollywood-Movie

ఈ కారు ధర రూ.3.15 నుండి 3.43 కోట్ల వరకు ఉంటుందట.ఇక ఈ కారును ఎన్టీఆర్ కొన్ని నెలల కిందట ఆర్డర్ చేయగా ఇటీవలే తన సొంతం చేసుకున్నాడు ఎన్టీఆర్.

ఈ కారు చూడటానికి బాగా లగ్జరీ గా ఉండటమే కాకుండా.ఇండియాలో తొలిసారిగా ఈ కారు కొన్నది ఎన్టీఆర్ మాత్రమే అని తెలిసింది.ఇక తాజాగా ఈ కారు దగ్గర హీరో శ్రీకాంత్, ఎన్టీఆర్ ఫోటో దిగి కనిపించగాన్టీఆర్ అభిమానులు ఆ కారుని చూసి తెగ లైక్స్ చేస్తున్నారు.అంతేకాకుండా కారు ధర చూసి తెగ షాక్ అవుతున్నారు.

Telugu Lamborghini Car, Car, Ntr, Ramcharan, Srikanth, Tollywood-Movie

ఇక ఇటీవలే నారింజ రంగులో ఇదే కంపెనీకి చెందిన లేటెస్ట్ మోడల్ కారులో ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇంటికి వెళ్లగా ఆ కారు కూడా నెట్టింట్లో బాగా వైరల్ గా మారింది.ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా తర్వాత కొరటాల శివ తో పాటు పలువురు దర్శకులతో కూడా సినిమాను ఫిక్స్ చేసుకున్నాడు.అంతేకాకుండా బుల్లితెరలో ఎవరు మీలో కోటీశ్వరులులో హోస్టింగ్ చేస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube