ఈ ఫోను ఖరీదు లక్ష 57 వేలు, ఫీచర్స్ చూస్తే బిత్తరపోవాల్సిందే

లంబోర్ఘిని (Lambhorghini, ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? ఎక్కడో, ఎదో సినిమాలో ఎదో హీరో కారు మీద ఈ పేరు చూసామే అనుకుంటున్నారా? ఇది కేవలం సెలబ్రిటీలు, డబ్బున్న బడా బాబులు మాత్రమే వాడగలిగే బ్రాండ్.ప్రధానంగా అయితే కారులు తయారుచేస్తుంది.ఈ కంపెని నుంచి వచ్చిన అత్యంత చవక కారు ఉరాస్ ధర ఎంతో తెలుసా? కేవలం 1.10 కోట్ల రూపాయలు.మీరు విన్నది నిజమే.ఇదే ఈ కంపెని కార్స్ లో అత్యంత చీప్ కారు.అంటే లెక్క కోటితోనే మొదలు అన్నమాట.ఇక ఈ కంపెనీ కారులలో అత్యంత ఖరీదైన కారు ధర 28 కోట్ల పైమాటే.

 Lambhorgini Alpha – One, Rs.1.57 Lakhs Phone Full Specifications-TeluguStop.com

ఇంత ధర పెట్టి కారు ఎందుకు కొంటారు, ఎవరు కొంటారు అనుకోకండి.ఈ కార్లు పెద్దగా మైలేజి ఇవ్వవు.

కాని కేవలం ప్రతిష్థ కోటీశ్వరులు వీటిని కొంటారు.పార్టీలకి వెళ్ళేటప్పుడు వాడుతుంటారు

సరే, కంపెని ఇంట్రడక్షన్ అయిపొయింది, ఇక అసలు సంగతికి వద్దాం.

ఈ కంపెని మొబైల్ ఫోన్స్ కూడా తయారుచేయడం మొదలుపెట్టింది.వీటి ధరలు లక్షల్లో ఉంటున్నాయి.

మూడు లక్షల అరవై వేల మొబైల్ ఒకటి ఇప్పటికే విడుదల చేసారు.దానికి సరైన రెస్పాన్స్ లేకపోవడం వలన ఏమో, కొత్తగా దానికి సగం కన్నా తక్కువ రేటులోనే, చీప్ గా ఒక లక్ష యాభై ఏడు వేలకి కొత్త మొబైల్ వదిలారు.

-Latest News - Telugu
దాని పేరే లంబోర్ఘిని ఆల్ఫా వన్.అసలు 50 వేలు దాటే ఐఫోన్ కొందామంటేనే వీలు కావడం లేదు, ధైర్యం రావడం లేదు, దానికి రెండింతలు రేటు ఉన్న దీన్ని ఎందుకు కొనడం, స్పెసిఫికేషన్స్ ఏమిటి అని అనుకుంటున్నారా? చూడండీ మీరే

Model : Lamborghini Alpha – One
Price : $2540 (1.57 Lakhs INR)

Specifications :


Screen Size – 5.5 inches
Resolution – 1440×2560 pixels
Processor – Quad Core (Snapdragon 820)
RAM – 4GB
Internal Memory – 64 GB
Expandable – microSD (128GB)
4G – YES
Camera – 20 MP back – 8 MP front
Battery – 3250 mAh
Platorm – Android 7.0

ఏంటి స్పెసిఫికేశన్స్ చూసి బిట్టరపోయారా? ఓ ఇరవై వేలు చేతికిస్తే ఇంతకంటే మంచి స్పెసిఫికేశన్స్ ఉన్న ఫోన్ కొనిస్తాం అంటున్నారా? ఈ ఫోన్ ప్రతిష్ట కోసమే తప్ప పని కోసం కాదు.ఎదో డబ్బు ఎక్కువై దీని మీద తగలేయడమే తప్ప ఇంకేమి లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube