పాపం లాలూ.. బెయిల్ వచ్చినా జైలులోనే

రాంచి: “జబ్ తక్ సమోసా మే ఆలూ రహేగా తబ్ తక్ బీహార్ మే లాలూ రహేగా” ఈ డైలాగ్ ను ఆర్జేడీ అధినేత‌, బీహార్ మాజీ ముఖ్య‌మంత్రి లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌ తన అధికార దర్పాన్ని ప్రదర్శిస్తూ గతంలో చాలా సందర్భాల్లో వాడారు.అప్పట్లో ఆయన హవా అలా కొనసాగేది.

 Lalu Prasad Yadav, Fodder Scam, Jharkand High Court, Chaibasa Khazana, Dhumka Kh-TeluguStop.com

కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.నాడు రాష్ట్ర రాజకీయాలతో పాటు దేశ రాజకీయాల్లోనూ చక్రం తిప్పిన ఈ బీహారీ డైనమిక్ లీడర్.

దాణా కుంభకోణం సహా పలు కేసుల్లో ఇరుక్కొని బయటకు రాలేని దీన పరిస్థితుల్లో ఉన్నారు.

తాజాగా చైబసా ఖజానా కేసులో జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసినా ఆయన జైలులో నుంచి బయటకు రాలేని పరిస్థితి.

ఈ కేసులో లాలూకు రెండు లక్షల పూచికత్తుపై కోర్టు బెయిల్ మంజూరు చేసింది.కానీ దుమ్కా ఖజానా కేసులో శిక్ష పడినందున ఆయన కారాగారవాసాన్ని కొనసాగించాల్సి ఉంది.

తన వాక్చాతుర్యం, హావభావాలతో దేశవ్యాప్తంగా మాస్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న ఈ నేత 2017 డిసెంబర్ నుంచి జైలులోనే మగ్గుతున్నారు.ఈ క్రమంలో ఆయన చాలా సందర్భాల్లో అనారోగ్యంపాలై చావు అంచుల దాక వెళ్లొచ్చారు.

కరోనా నేపథ్యంలో అతని ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పెరోల్ మంజూరు చేయవలసిందిగా అతని చిన్న కుమారుడు తేజస్వి యాదవ్ కోర్టును పలు మార్లు అప్పీల్ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

త్వరలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో లాలూ బయటకు వస్తే ఆర్జేడీ పరిస్థితి కొద్దిగా మెరుగుపడుతుందని పార్టీ క్యాడర్ ఆశించినప్పటికీ వారి ఆశలు అడియాశలుగానే మిగిలిపోయాయి.“జబ్ తక్ లాలూ జిందా రహేగా తబ్ తక్ జైల్ మే రెహానాహీ పడేగా” అంటూ అతని రాజకీయ ప్రత్యర్థులు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.పాపం లాలూ…

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube