'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' బడ్జెట్‌ ఎంతో.. బిజినెస్‌ ఎంతో తెలిస్తే నోరు వెళ్లబెడతారు

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ అత్యంత వివాదాస్పద అంశం ఎన్టీఆర్‌, లక్ష్మీ పార్వతి రిలేషన్‌ షిప్‌ ను కథాంశంగా తీసుకుని తెరకెక్కించిన చిత్రం ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’.ఈ చిత్రంలో చంద్రబాబు నాయుడును విలన్‌గా వర్మ చూపించబోతున్నాడు అనేది అందరికి తెలిసిన బహిరంగ రహస్యం.

 Lakshmis Ntr Pre Business And Budget-TeluguStop.com

లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రంలో రామ్‌ గోపాల్‌ వర్మ అప్పటి విషయాలను బయటకు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.ఎన్టీఆర్‌కు చంద్రబాబు నాయుడు వెన్ను పోటు పొడిచిన సమయంలో జరిగిన పరిణామాలు, అప్పట్లో మీడియాలో రాని విషయాలను చాలా క్లీయర్‌గా చూపించేందుకు వర్మ సిద్దం అయ్యాడు.

అప్పటి వైశ్రాయ్‌ ఉదంతం గురించి చాలా మందికి తెలియదు.అసలు టీడీపీ కీలక నాయకులకు కూడా అప్పుడు ఏం జరిగిందనే విషయంపై క్లారిటీ లేదు.ఎందుకంటే అప్పుడు మీడియాలో వచ్చిన కథనాలు అన్ని కూడా చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా, ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా వచ్చాయి.దాంతో ఆ మీడియా కథనాలను ఎవరు నమ్మడం లేదు.

అలాంటి విషయాలను వర్మ తీసిన కారణంగా సహజంగానే సినిమాకు విపరీతమైన క్రేజ్‌ ఏర్పడటం కామన్‌.అంతా కొత్త వారితో తీసిన ఈ చిత్రంకు వర్మ కేవలం 7 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది.

వర్మ సినిమా కనుక పబ్లిసిటీ ఖర్చు పెద్దగా చేయకుండానే పబ్లిసిటీ అయ్యింది.

సినిమాకు అన్ని ఖర్చులు కలిపి పది కోట్ల రూపాయలకు లోపులోనే పూర్తి చేసి ఉంటాడు అనేది టాక్‌.ఇక సినిమాను బయ్యర్లు కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారు.అన్ని ఏరియాల్లో కలిపి ఈ చిత్రం దాదాపుగా 20 కోట్ల వరకు బిజినెస్‌ చేసే అవకాశం ఉంది.

ఇక శాటిలైట్‌ రైట్స్‌, డబ్బింగ్‌ రైట్స్‌, ప్రైమ్‌ వీడియో రైట్స్‌ ఇలా అన్ని రైట్స్‌ కలిపి మరో ఆరు కోట్ల వరకు వచ్చే అవకాశం ఉంది.అంటే పాతిక కోట్లకు పైమాటే అన్నమాట.

బడ్జెట్‌ తీసేస్తే 15 కోట్లకు మించి వర్మ మూవీకి మిగలనుందన్నమాట.ఈ చిత్రానికి వర్మ పెట్టుబడి పెట్టకుండానే సగం భాగస్వామి అయ్యాడు.

అందువల్ల ఈ చిత్రంతో వర్మకు దాదాపుగా ఏడు నుండి ఎనిమిది కోట్ల వరకు వచ్చే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube