లక్ష్మీస్ ఎన్టీఆర్ మరో ట్రైలర్ తో కాక రేపిన ఆర్జీవి!

ఎన్టీఆర్ జీవిత చరిత్రలో కీలక ఘట్టం ఆయనని ముఖ్యమంత్రి పదవి నుంచి పదవీచ్యుతుని చేసి చంద్రబాబు ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోవడం.ఆ ఘటన నిజానికి ఎలా జరిగింది అనేది, అసలు ఆ ఘటన వెనుక వాస్తవాలు, ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అనే విషయం ప్రస్తుతం తరంలో ఎవరికి తెలియదు.

 Lakshmis Ntr Movie Trailer 2 Release-TeluguStop.com

అయితే ఇప్పుడు ఆర్జీవి లక్ష్మీస్ ఎన్టీఅర్ టైటిల్ తో ఆ వాస్తవ ఘట్టాన్ని తెరపై ఆవిష్కరిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ తో కాక రేపిన ఆర్జీవి మరో ట్రైలర్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు.

ఇక ఈ ట్రైలర్ 2లో ఎన్టీఆర్ మీద చంద్రబాబు ఎలాంటి కుట్ర చేసారు.ఎలా అతనిని నమ్మించి మోసం చేసి, పార్టీ ఎమ్మెల్యేలని తన వైపు తిప్పుకొని అతనిని ముఖ్యమంత్రి పదవి నుంచి దించేసాడు అనే విషయాలపై విజువల్స్ చూపించాడు.

అలాగే లక్ష్మి పార్వతి మీద అప్పటి టీడీపీ నాయకుల, ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల వ్యవహార శైలి ఎలా వుంది.ఆమెని అడ్డం పెట్టుకొని చంద్రబాబు వేసిన ప్లాన్ ఏంటి అనే విషయాలని ఈ ట్రైలర్ లో ఆర్జీవి ఆవిష్కరించే ప్రయత్నం చేసాడు.

పూర్తి వివాదాస్పదంగా ప్రస్తుతం చంద్రబాబుని బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తీసే విధంగా వున్న ఈ ట్రైలర్ లో తెలుగు దేశం పార్టీ శ్రేణులు ఎలా స్పందిస్తాయి అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube