జనాల మాట : ఏపీ ఎన్నికలపై రామ్‌ గోపాల్‌ వర్మ సినిమా ప్రభావం చూపుతుందట  

Lakshmi\'s Ntr Movie Effect On Ap Elcections-cm Chandrababu,lakshmi\\'s Ntr Movie Effect,ram Gopal Varma

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో రూపొందిన ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ మూవీ విడుదలకు సిద్దం అయ్యింది. ఈనెల 22న గ్రాండ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు సిద్దం చేశారు. భారీ ఎత్తున అంచనాలున్న లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ మూవీ త్వరలో జరుగబోతున్న అసెంబ్లీ ఎన్నికలను ప్రభావితం చేస్తుందా అనే అంశంపై రామ్‌ గోపాల్‌ వర్మ ఒక పోల్‌ నిర్వహించడం జరిగింది. ఆ పోల్‌లో రామ్‌ గోపాల్‌ వర్మ తీస్తున్న సినిమా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితంపై ప్రభావం చూపుతుందని అంటున్నారు...

జనాల మాట : ఏపీ ఎన్నికలపై రామ్‌ గోపాల్‌ వర్మ సినిమా ప్రభావం చూపుతుందట-Lakshmi's Ntr Movie Effect On Ap Elcections

రామ్‌ గోపాల్‌ వర్మ ఈ చిత్రంలో చంద్రబాబు నాయుడును పూర్తి విలన్‌గా చూపించాడు.

ఆ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పాడు. ఎన్టీఆర్‌ను ఎలా అయితే చంద్రబాబు నాయుడు వెన్ను పోటు పొడిచాడో అచ్చు అలాగే ఈ చిత్రంలో చూపించామని, చంద్రబాబు నాయుడు అసలు స్వరూపంను చూపిస్తామంటూ వర్మ చెబుతున్నాడు. ఇదే సమయంలో వర్మ ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ మరియు లక్ష్మీ పార్వతిల మద్య ఉన్న అసలు సంబంధంను కూడా చూపిస్తానంటూ చెబుతున్నాడు.

లక్ష్మీ పార్వతి ఎంటర్‌ అయిన తర్వాత ఎన్టీఆర్‌ జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందనే విషయాన్ని చూపించబోతున్నారట. లక్ష్మీ పార్వతిని నందమూరి కుటుంబ సభ్యులు పెట్టిన ఇబ్బందులు ఆ తర్వాత జరిగిన పరిణామాలను ఈ చిత్రంలో వర్మ చూపించబోతున్నాడు. వాడు, నా పిల్లలు కలిసి నన్ను వెన్ను పోటు పొడిచారు అంటూ ఈ చిత్రంలో పదే పదే చెప్పడం జరుగుతుందట. అందుకే చంద్రబాబు నాయుడుపై ఈ చిత్రం ప్రభావం ఉంటుందని జనాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

వర్మ పోల్‌ నిర్వహించగా 8 వేల మంది పార్టిసిపేట్‌ చేశారు. అందులో 70 శాతం మంది కూడా ఈ ఎన్నికలపై లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ మూవీ ప్రభావం ఉంటుందని అన్నారు. మరి నిజంగానే చంద్రబాబు విజయావకాశాలను వర్మ గండి కొడతాడేమో చూడాలి.