లక్ష్మినారాయణ కొత్త నినాదం! ఎన్నికల మేనిఫెస్టో చట్టబద్ధం

జగన్ అవినీతి కేసుని విచారించిన సిబిఐ మాజీ జేడీ లక్ష్మినారాయణకి రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ఫాలోయింగ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఆ కేసు తర్వాత ఒక్కసారిగా పాపులర్ అయిన లక్ష్మినారాయణ మచ్చలేని అధికారిగా ప్రజలతో మన్ననలు అన్ధుకున్నారు.

 Lakshminarayana Says Try To Legalize Election Manifesto-TeluguStop.com

ఇక తాజాగా ఆయన రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చిన జనసేన పార్టీ తరుపున విశాఖ పార్లమెంట్ అభ్యర్ధిగా బరిలో దిగిన సంగతి అందరికి తెలిసిందే.ఇక విశాఖలో అతని గెలుపు సునాయాసం అనే టాక్ ఇప్పుడు వినిపిస్తుంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు వివి లక్ష్మినారాయణ పలు రాజకీయ, సామాజిక కార్యక్రామాలలో చురుకుగా పాల్గొంటూ తనదైన శైలిలో వాణిని వినిపించే ప్రయత్నం చేస్తున్నాడు.జనసేన పార్టీతో భవిష్యత్తులో రాజకీయాలలో స్పష్టమైన మార్పుని చూడబోతున్నారు అంటూ లక్ష్మినారాయణ చెబుతున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా అంబాజీపేటలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న లక్ష్మినారాయణ ఓ ఆసక్తికరమైన డిమాండ్ ని తెరపైకి తీసుకొచ్చాడు.ప్రజాప్రతినిధులు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీలకి చట్టబద్దత కల్పించాలని, ఒక్కసారి హామీలు ఇస్తే కచ్చితంగా నెరవేర్చి తీర్చే విధంగా చట్టం చేయాలని డిమాండ్ చేసారు.

అలా చేస్తే తప్పుడు హామీలు ఇవ్వాలనే ఆలోచన ఎవరికి రాదని చెప్పుకొచ్చారు.ఓ విధంగా చూస్తే లక్ష్మినారాయణ చెప్పిన మాట బాగానే ఉన్న రాజకీయ పార్టీలు దీనికి ఎంత వరకు ఒప్పుకుంటాయి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube