జనసేన - వైసీపీ ట్వీట్ వార్ సరే! ఎవరి లెక్క నిజం అవుతుంది  

విజయసాయిరెడ్డికి కౌంటర్ ఇచ్చిన లక్ష్మినారాయణ. ట్వీట్ వార్. .

Lakshminarayana Counter To Vijaya Sai Reddy Tweet-janasena,lakshminarayana Counter,tdp,vijaya Sai Reddy Tweet,ysrcp

ఏపీలో సార్వత్రిక ఎన్నికల అద్యయనం ముగిసిపోయింది. ఇక రాజకీయ పార్టీలు ఎన్నికలలో ప్రజల తీర్పుని తెలుసుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ ఈ ఎన్నికలలో ప్రజా తీర్పు తమకే అనుకూలంగా ఉంటుంది అని ఎన్నో నమ్మకాలు పెట్టుకుంది..

జనసేన - వైసీపీ ట్వీట్ వార్ సరే! ఎవరి లెక్క నిజం అవుతుంది-Lakshminarayana Counter To Vijaya Sai Reddy Tweet

ఇక అధికార పార్టీ వైసీపీ కూడా ప్రజా తీర్పు తమ సంక్షేమానికే పడుతుందని బయటకి చెబుతున్న లోపల అంతర్మధనంలో ఉంది. ఈ సారి ఓడిపోతే ప్రతిపక్ష హోదాలో ఎలా ముందుకి వెళ్ళాలి అని లెక్కలు వేసుకుంటుంది. అయితే రెండు పార్టీలు బయటకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంది.

ఇదిలా ఉంటే మరో వైపు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికలలోవిస్తృతంగా పర్యటించి, ప్రజలని ఆకట్టుకునే ప్రయత్నం చేసి ఎన్నికల తర్వాత నిశ్శబ్దంగా ఉన్నారు. ఇక జనసేన పార్టీ క్యాడర్ కూడా అధినేతనే ఫాలో అవుతుంది. అయితే కొద్ది రోజుల క్రితం జనసేన పార్టీ విశాఖ ఎంపీ అభ్యర్ధి వివి లక్ష్మినారాయణ జనసేన పార్టీ 85 సీట్లు తెచ్చుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని బలంగా చెప్పారు. లక్ష్మినారాయణ చెప్పాడంటే అందులో ఎంతో కొంత నిజం ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.

దీంతో ప్రతిపక్ష పార్టీ లక్ష్మినారాయణ మాటలకి కాస్తా ఉలిక్కిపడింది. వైసీపీ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో కౌంటర్ వేసారు. జనసేన పార్టీ 65 సీట్లలో పోటీ చేస్తే 85 సీట్లు ఎలా తెచ్చుకుంటుంది అంటూ లక్ష్మినారాయణని ప్రశ్నించారు. దీనిపై రాజకీయ వర్గాలలో కూడా చర్చ నడిచింది. జనసేన మిత్ర పక్షాలతో కలిపి 172 స్థానాలలో పోటీ చేస్తుందని అది విజయసాయి రెడ్డికి తెలియదనుకుంటా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపించాయి. తాజాగా లక్ష్మినారాయణ కూడా అతనికి కౌంటర్ వేసారు.

మా లెక్కలు ఖచ్చితంగా ఉంటాయి. సీఏ చదివినా మీ లెక్కలు ఎందుకు తప్పుతున్నాయో తెలియడం లేదంటూ ఎద్దేవా చేశారు. ఇప్పుడు వీళ్ళిద్దరి లెక్కలలో ఏది నిజం అవుతుంది అనే విషయం ఏపీ రాజకీయాలలో ఆసక్తికర చర్చకి దారితీసింది..