లక్ష్మీనారాయణకు వైసీపీ ఆఫర్ అందిందా ? ఆ తరువాత ఏమైందంటే ?  

Does Lakshminarayana Gets Ycp Offer-lakshminarayana,pawan Kalyan,political Updates,వైసీపీ ఆఫర్ అందిందా

కొద్ది రోజులుగా వైసీపీ – జనసేన పార్టీలో కీలక వ్యక్తులుగా ఉంటున్న విజయసాయిరెడ్డి , సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మధ్య ట్విట్టర్ వేదిక గా రాజకీయ యుద్ధం జరుగుతోంది. ఆ యుద్ధం మరింత ముదిరి ఒకరి లెక్కలు మరొకరు సరిచూసుకుంటున్నారు. ఇప్పుడు వైసీపీ నాయకుడు విజయసాయిరెడ్డి మీద లక్ష్మీనారాయణ ఇప్పుడు గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. కాకపోతే అది అక్రమాస్తుల కేసుల గురించి అయితే కాదు..

లక్ష్మీనారాయణకు వైసీపీ ఆఫర్ అందిందా ? ఆ తరువాత ఏమైందంటే ?-Does Lakshminarayana Gets YCP Offer

ఎందుకంటే గతంలోనే జగన్ అక్రమాస్తుల కేసుల గురించి తాను మాట్లాడానని, అది కోర్టు పరిధిలో ఉందని చెప్పాడు. ఇక విషయానికి వస్తే లక్ష్మి నారాయణ తన ఉద్యోగానికి రాజీనామా చేసిన తరువాత పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు చూస్తున్న సమయంలో వైసీపీ నుంచి ఆయనకు ఆఫర్ అందిందట. అది కూడా స్వయంగా విజయసాయి రెడ్డి నుంచే అన్న విషయాన్ని లక్ష్మీనారాయణ ఇప్పుడు బయటపెట్టాడు.

ఇప్పుడు ఈ విషయాలు బయటపెట్టడం ద్వారా వైసీపీ నుంచి తనపై జరుగుతున్న ఎదురు దాడిని ఆయన కొంత వరకు అడ్డుకట్ట వేయడానికేనన్న విషయం స్పష్టంగా అర్ధం అవుతోంది. లక్ష్మీనారాయణ వ్యక్తిత్వం గురించి చూస్తే ఆయన సీబీఐ లో నిజాయితి కలిగిన ఆఫీసర్ గా గుర్తింపు పొందాడు. సీబీఐ లో జాయింట్ డైరెక్టర్ (జేడీ ) పనిచేసిన ఆయన జేడీ అన్న పదాన్ని ఆయన ఇంటిపేరుగా ప్రజలు మార్చేసే అంత రేంజ్ లో పాపులర్ అయిపోయాడు.

తాను దర్యాప్తు చేసిన సత్యం రామలింగరాజు, గాలి జనార్ధన్ రెడ్డి, జగన్ కేసుల్లో ప్రతి చిన్న విషయాన్ని ఆధారాలతో సహా కోర్టు ముందు ఉంచారు. వాస్తవానికి ఆయన ఏ మాత్రం ప్రలోభపడినా ఆ కేసులన్నీ నీరుగారిపోయేవి. వైసీపీ అధినేత జగన్ సాగించిన క్విడ్ ప్రో కో వ్యవహారాలన్నీ సాక్ష్యాలతో సహా బయటకు తవ్వి తీశారు.

సీబీఐలో లక్ష్మినారాయణ డిప్యూటేషన్ ముగిసిన తర్వాత వాటిపై విచారణ స్లో అయిపొయింది.

అదంతా గతం. కానీ అటువంటి లక్ష్మీనారాయణను ఆయన వల్లే తాము జైలుకు వెళ్లాల్సి వచ్చిందని, చంద్రబాబు చెప్పినట్లు చేస్తారని నిందలు వేసే వ్యక్తిని కూడా తమ పార్టీలోకి ఆహ్వానించారు విజయ సాయి రెడ్డి. లక్ష్మినారాయణను విజయసాయిరెడ్డి పార్టీలోకి ఆహ్వానించడం అంటే.

ఆయనకు ఓ రకంగా ఎవరితోనూ సంబంధాలు లేవని నమ్మడమే. నిజంగా వీవీ లక్ష్మినారాయణ చంద్రబాబు చెప్పినట్లో, మరొకరు చెప్పినట్లో కేసుల దర్యాప్తు చేశారని వైసీపీ నేతలు నమ్ముతూ ఉంటే ఆయనను ఎందుకు పార్టీలోకి ఆహ్వానిస్తారు ? ఇప్పుడు ఈ విషయాలను బయటపెట్టడం ద్వారా వైసీపీని లక్ష్మీనారాయణ ఇరకాటంలో పడేసినట్టే.