వీరమల్లు షూటింగ్ బాధ్యతలని మరో దర్శకుడుతో పంచుకున్న క్రిష్

టాలెంటెడ్ దర్శకుడుగా టాలీవుడ్ లో తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న వ్యక్తి క్రిష్ జాగర్లమూడి.ప్రస్తుతం క్రిష్ పవన్ కళ్యాణ్ హీరోగా మొఘలాయిల కాలం నాటి కథాంశంతో ఒక సినిమాని తెరకెక్కిస్తున్నారు.దీనికి హరిహరవీరమల్లు అనే టైటిల్ పెట్టినట్లు టాక్ వినిపిస్తుంది.ఈ సినిమాలో విప్లవనాయకుడుగా పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఉండబోతుంది. నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్ కి జోడీగా ఈ సినిమాలో నటిస్తుంది.ఇదిలా ఉంటే భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది.

 Lakshmikanth Chenna Backs Pawan Kalyan Film-TeluguStop.com

అయితే సంక్రాంతికి ఈ సినిమాని రిలీజ్ చేయాలని క్రిష్ టార్గెట్ పెట్టుకున్నాడు.ఈ నేపధ్యంలో సినిమా షూటింగ్ ని రెండు యూనిట్ లుగా క్రిష్ డివైడ్ చేశాడు.

పవన్ కళ్యాణ్ ఉన్న సన్నివేశాలు అన్ని చిత్రీకరించే బాద్యతని తాను తీసుకున్నాడు.ఇక సెకండ్ యూనిట్ దర్శకుడుగా మరో వ్యక్తికి అవకాశం ఇచ్చాడు.

 Lakshmikanth Chenna Backs Pawan Kalyan Film-వీరమల్లు షూటింగ్ బాధ్యతలని మరో దర్శకుడుతో పంచుకున్న క్రిష్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సాధారణంగా పెద్ద చిత్రాలకు ఇది కామన్‌గా జరిగే విషయమే కానీ బయటకు పెద్దగా చెప్పరు.రాజమౌళి డైరెక్ట్‌ చేసే సినిమాల సెకండ్‌ యూనిట్‌ను ఆయన తనయుడు డైరెక్ట్‌ చేస్తుంటాడు.అత్యంత భారీ బడ్జెట్‌తో ఎఎం రత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నారు.సినిమా కోసం హైదరాబాద్‌ శివార్లలో భారీ ఛార్మినార్‌ సెట్‌, గండికోట సంస్థానం సెట్‌ నిర్మించారు.లక్ష్మీకాంత్ చెన్నా తాజాగా కమిట్మెంట్ అనే వెబ్ ఫిలిం ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.అంతకు ముందుకూడా అతను చేసిన సినిమాలు పెద్దగా హిట్ అయిన దాఖలాలు లేవు.

అయితే క్రిష్ మాత్రం అతని టాలెంట్ ని నమ్మి సెకండ్ యూనిట్ బాద్యతలు అప్పగించినట్లు తెలుస్తుంది.

#Nidhi Agarwal #Director Krish

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు