మూడు విభిన్న పాత్రలలో కనిపించనున్న లక్ష్మిరాయ్

ఎప్పుడో దశాబ్దం క్రితం హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కూడా ఇప్పటి వరకు సరైన గుర్తింపు తెచ్చుకోలేకపోయిన నటీమణులలో లక్ష్మి రాయ్ ఒకరు.అందంతోపాటు, నటిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడుకి హీరోయిన్ గా కంటే ఐటెం సాంగ్స్ ద్వారానే ఎక్కువగా గుర్తింపు వచ్చింది.

 Lakshmi Rai Triple Role In Cinderella Movie, Tollywood, Telugu Cinema, South Cin-TeluguStop.com

ఇప్పటికి ఈ భామ హీరోయిన్ గా సక్సెస్ అవడానికి తన ప్రయత్నాలు చేస్తూనే ఉంది.అందాల ఆరబోతలో ముందుండే ఈ భామకి కమర్షియల్ హీరోయిన్స్ గా అవకాశాలు రావడం లేదనే చెప్పాలి.

ప్రస్తుతం ఎక్కువగా హర్రర్ చిత్రాల ట్రెండ్ నడుస్తూ ఉండటంతో అప్పుడప్పుడు ఆ జోనర్ లో ఎక్కువగా లక్ష్మి రాయ్ సినిమాలు చేస్తూ వస్తుంది.

హర్రర్ సినిమాలలో సత్తా చాటుతున్న సక్సెస్ మాత్రం దోబూచులాడుతుంది.

అయితే ఈ సారి సౌత్ లో ఇప్పటి వరకు ఏ హీరోయిన్స్ కి సాధ్యం కాని విధంగా లక్ష్మీరాయ్ ఏకంగా మూడు పాత్రలలో కనిపించే అవకాశం సొంతం చేసుకుంది.ప్రస్తుతం సిండ్రెల్లా అనే తమిళ హారర్ థ్రిల్లర్ లో ఈ అమ్మడు నటిస్తుంది కెరీర్ లో ఫస్ట్ టైమ్ ట్రిపుల్ రోల్ లో ఈ సినిమాలో లక్ష్మి రాయ్ కనిపించనుంది.

హీరోయిన్స్ కి డ్యూయల్ రోల్ చేయడమే అరుదుగా వచ్చే అవకాశం.డ్యూయల్ రోల్ చేసిన హీరోయిన్స్ పేర్లు వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు.అయితే ఏకంగా ఒకే సినిమాలో త్రిపాత్రాభినయం చేసే అవకాశాన్ని సిండ్రెల్లా సినిమా ద్వారా లక్ష్మి రాయ్ సొంతం చేసుకుంది.ఇందులో టైటిల్ రోల్ తో పాటు, రాక్ స్టార్ గా కనిపించనుంది.

మరోవైపు దెయ్యంగా భయపడుతోంది.మరి ఈ సినిమా లక్ష్మి రాయ్ ని ఎంత వరకు గుర్తింపు తీసుకొస్తుంది అనేది వేచి చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube