అది ఫేక్‌ అకౌంట్‌... ఎన్టీఆర్‌ అభిమానులకు హెచ్చరిక

యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌ భార్య లక్ష్మి ప్రణతి ట్విట్టర్ లో జాయిన్ అయ్యారు.ఆయన భార్య కనుక లక్ష్మి ప్రణతికి మంచి స్వాగతం దక్కింది అంటూ సోషల్ మీడియాలో మరియు వెబ్‌ మీడియా లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

 Lakshmi Pranathi In Twitter Is Fake News , Flim News, Lakshmi Pranathi, Ntr, Twi-TeluguStop.com

అయితే ఎన్టీఆర్‌ భార్య లక్ష్మి ప్రణతి నిజంగా ట్విట్టర్ లో జాయిన్ అయ్యిందా అంటే ఇప్పటి వరకు అధికారికంగా ఏ ఒక్కరు కూడా స్పందించలేదు.ఒక వేళ లక్ష్మి ప్రణతి కనుక ట్విట్టర్ లో అడుగు పెట్టి ఉంటే ఖచ్చితంగా ఎన్టీఆర్‌ స్వయంగా ఆమెకు స్వాగతం చెబుతూ ట్వీట్‌ చేసేవాడు.

ఆమె ట్విట్టర్ హ్యాండిల్‌ ను అభిమానులకు షేర్‌ చేసేవాడు.కాని ఇప్పటి వరకు ఎన్టీఆర్‌ నుండి ఎలాంటి స్పందన రాలేదు.

అంతే కాదు నా భర్త యొక్క ఫొటోను మొదటి ట్వీట్‌ గా షేర్‌ చేస్తున్నా ను అంటూ లక్ష్మి ప్రణతి పేరు తో ఉన్న అకౌంట్‌ నుండి ఫొటో ను షేర్‌ చేయడం జరిగింది.

-Movie

కనీసం ఆ ఫొటో కు కూడా ఎన్టీఆర్‌ నుండి ఎలాంటి స్పందన రాలేదు.దాంతో ఆ అకౌంట్‌ ఫేక్‌ అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మొదటగా ట్విట్టర్‌ లేదా మరేదైనా సోషల్‌ మీడియా లో జాయిన్ అయిన సమయంలో ఖచ్చితంగా రేర్‌ ఫొటో లను షేర్‌ చేయడం జరుగుతుంది.

కాని లక్ష్మి ప్రణతి అకౌంట్‌ పేరు తో ఉన్న అకౌంట్‌ లో గూగుల్‌ నుండి ఎత్తిన ఫొటో లను షేర్‌ చేస్తున్నారు.దాంతో ఆ అకౌంట్‌ శతకోటి ఫేక్ అకౌంట్స్ ఒకటి అన్నట్లుగా క్లారిటీ వచ్చింది.

అభిమానులు ఆ అకౌంట్‌ తో జాగ్రత్తగా ఉండండి అంటూ నందమూరి అభిమానులకు మీడియా సర్కిల్స్ వారు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు హెచ్చరికలు చేస్తున్నారు.ఇలా సెలబ్రెటీల పేర్ల తో ఫేక్‌ అకౌంట్లు క్రియేట్‌ చేయడం ఈ మద్య కామన్‌ విషయం అయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube