రామారావు గారు చేసిన అన్ని సినిమాలు చాలానే హిట్ అయ్యాయి.అయితే రామారావు గారు నటించే సినిమాల్లో హీరోయిన్స్ విషయంలో ఆయన ఇన్వాల్వ్మెంట్ అనేది ఎలా ఉండేదో చాలామందికి తెలియదు.
అయితే హీరోయిన్ ఎంపిక విషయంలో NTR గారి పాత్ర చాలా ఉండేదట.ఎన్టీ రామారావు గారు నటించిన సినిమాల్లో హీరోయిన్ కోసం చాలా కష్టపడ్డారట.
అందుకే ఒకానొక సమయంలో ఎన్టీఆర్ హీరోయిన్స్ ను దిగుమతి చేసుకున్నారట.భానుమతి గారితో మల్లీశ్వరి సినిమాలో నటించారు.
అది సూపర్ హిట్ అయింది.అయితే అప్పట్లో ఎందుకోగానీ భానుమతి రామారావు గారికి కాల్ షీట్స్ ఇచ్చేది కాదట.
అలాగే రామారావు గారితో అంజలి దేవి కూడా చాలా సినిమాలు చేసింది.అన్ని సినిమాలు హిట్ అయ్యాయి.
కానీ ఎప్పుడు కూడా అంజలీదేవి రామారావుగారి కాల్ షీట్లు ఇచ్చేది కాదట.అలాగే హీరోయిన్ సావిత్రితో కూడా రామారావు గారు నటించారు.
వీళ్ళ కాంబినేషన్లో ఎన్నో మంచి సినిమాలు వచ్చాయి.ఈవిడ కూడా అంతే రామారావు గారికి కాల్ షీట్లు ఇచ్చేది కాదు.
అలా రామారావు గారు తన సినిమాల్లో నటించే హీరోయిన్ల విషయంలో చాలా ఇబ్బందులు పడ్డారట.అందుకనే ఎన్టీఆర్ గారు బి.
సరోజిని ప్రమోట్ చేశారట.అలాగే ఆయన హీరోయిన్ దేవికను కూడా బాగా ప్రమోట్ చేశారు.
ఎన్టీఆర్ ప్రమోట్ చేసిన హీరోయిన్లలో కేఆర్ విజయ గారు కూడా ఒకరు.అలా హీరోయిన్ల అందర్నీ ఒకప్పుడు ఇండస్ట్రీలోకి తీసుకు వచ్చింది ఎన్టీ రామారావు గారే.
అయితే వీళ్లు రామారావు గారిని మర్చిపోయి, నాగేశ్వరావు గారితో సినిమాలు తీసే వాళ్ళట.అయితే ఒకానొక సందర్బంలో రామారావు గారు సావిత్రిని తనతో నటించమని అడిగితే.ఆవిడ నవ్వుతూ లేదండి.నాన్ స్టాప్ గా మూడు సంవత్సరాల పాటు నాగేశ్వరావు గారు డేట్స్ తీసుకున్నారు అని చెప్పిందట.
అలా నాగేశ్వరావు గారు హీరోయిన్స్ ను బ్లాక్ చేసేవారట.సావిత్రి కష్టాలు పడడానికి ఇది కూడా ఒక కారణం అనే చెప్పవచ్చు.
ఎందుకంటే నాగేశ్వరరావు గారికి డేట్స్ ఇవ్వడం వల్ల ఈ మూడు సంవత్సరాలలో మరే హీరోకి డేట్స్ లేకుండా పోయేయట.ముఖ్యంగా ఎన్టీఆర్, శివాజీ గణేశన్, N.V రామచంద్రన్ గారికి డేట్స్ లేకుండా పోయేవట.ఇలా ఒకానొక సమయంలో రామారావు గారు హీరోయిన్స్ విషయంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
అంటే వాణిశ్రీ, జయసుధ, జయప్రద వీళ్ళు అందుబాటులోకి వచ్చేంత వరకు చాలా ఇబ్బందులు పడ్డారట.అందుకనే ఎన్టీఆర్ ఎక్కువగా కృష్ణకుమారితో ఎక్కువగా సినిమాలు చేశారట.కృష్ణ కుమారి ఫ్లెక్సిబుల్ గా ఉండడమే ఒక కారణం అని చెప్పాలి.అలాగని ఎన్టీఆర్ తన సినిమాల్లో జానకిని కంటిన్యూ చేయలేకపోయాడు.
ఎందుకంటే జానకి పర్సనాలిటీ ఎన్టీఆర్ అందానికి సరితూగదని భావించి, కృష్ణ కుమారి వరకు మెయింటైన్ చేసారు.
అయితే అప్పట్లో రామారావు గారు, కృష్ణ కుమారితో సినిమాలు చేసే సమయంలో కృష్ణ కుమారి, రామారావు గారు ఇద్దరూ ప్రేమించుకున్నారు అనే వార్తలు కూడా వచ్చాయి.అయితే ప్రేమాయణం దాక కాకుండా పెళ్లి వరకు కూడా వెళ్లారట.ఎందుకంటే వీరు ఇద్దరు కలిసి వరుస సినిమాలు చేయడం ఒక కారణం అయితే.
కృష్ణ కుమారి మనస్తత్వం ఒక కారణం అని చెప్పవచ్చు.కృష్ణ కుమారి మనస్తత్వం ఎలాంటిది అంటే ఎవరిని నొప్పించదు.
చాలా ఫ్లెక్సిబుల్ గా ఉండేదట.అలాగే తనను తాను కాపాడుకుంటూ వచ్చేదట.
కృష్ణ కుమారిలో ఉన్న ఈ గుణాలు రామారావు గారికి బాగా నచ్చాయట.అయితే అప్పటికే ఎన్టీఆర్ కి పెళ్లి అయిపోయింది.
ఎన్టీఆర్ వాళ్ళ భార్య బాలింతగా ఉన్న సమయం ఒకపక్క, మెంటల్ రిలాక్సేషన్ కోసం ఏమి చేయాలో తెలియని పరిస్థితి మరోపక్క.ఇంకా వేరే అవకాశం లేకనో లేక మరే కారణాల చేతనే రామారావు గారు కృష్ణ కుమారి పట్ల ఆకర్షితుడయ్యాడట.
అయితే ఈ విషయం ఎన్టీఆర్ భార్య అయిన బసవతారకమ్మ గారికి కూడా తెలుసు.సరే అండి మీకు ఇష్టమైతే నేను కాదు అనను కదా.మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ అది మంచిదే అవుతుందని మాకు తెలుసు అని అన్నారట.అలా రామారావు గారి భార్య రామారావు గారికి అనుమతివ్వడం కూడా జరిగింది.
అలానే కృష్ణ కుమారి గారు కూడా ఒకే చెప్పేసారు.అయితే ఇద్దరు పెళ్లి చేసుకుందాం అనే సమయానికి ఒక కధ జరిగింది.
అదేంటంటే ఎన్టీఆర్ గారు ఇలా కృష్ణ కుమారి గారిని పెళ్లి చేసుకోబోతున్నట్లు చిన్నాయనకి కబురు చేశారట.నేను కృష్ణ కుమారిని పెళ్లి చేసుకోబోతున్న.
మీరు వస్తే బాగుంటుంది అన్నారట.అరేయ్ నువ్వు అక్కడితో ఆగు… నేను వస్తున్నా అని విజయవాడ కళ్యాణ్ చక్రవర్తితో ఉన్న త్రివిక్రమరావు గారు బండి వేసుకుని హడావుడిగా మద్రాసు చేరుకున్నారట.
అయితే చిన్నాయన రావటం రావటం బండి వేసుకుని కృష్ణ కుమారి గారి ఇంటికి వెళ్లిపోయాడు అంట.కృష్ణ కుమారి గారి ఇంటికి వెళ్ళే సమయానికి కృష్ణకుమారిగారు చక్కగా పట్టు చీర కట్టుకుని ముస్తాబయ్యి, సింగారించుకుని కూర్చుందట.అయితే చిన్నాయనకు ఎప్పుడు కూడా తన బొడ్డులో ఒక తుపాకీ ఉండేదట.షూటింగ్ కి వెళ్లిన కానీ ఆయన వెంట తూపాకి ఉండేది అంట.ఎప్పుడయితే కృష్ణ కుమారిని అలా చూసాడో వెంటనే టక్కుమంటూ తుపాకీ తీసి బెదిరించాడట.ఏంటి.? రామారావు గారితో పెళ్లి ఏంటి? ఆంధ్రదేశం మొత్తం ఆయన్ని ఒక రాముడుగా, కృష్ణుడుగా, దేవుడులాగా పూజిస్తుంటారు.ఈ రోజు రెండో పెళ్లి చేసుకుంటే ఎన్టీ రామారావు గారిని వాళ్ళు ఎలా చూస్తారు.
ఆయన ఇమేజ్ ఏమవుతుంది.ఆయన పరువు, ప్రతిష్ట గురించి నువ్వు ఆలోచించవా? అని బెదిరించారు అంట.దానికి కృష్ణ కుమారి గారు ఇలా అన్నారట.రామారావు గారు నాకు బాగా దగ్గర అయ్యారు అని జవాబిచ్చింది.
దాంతో ఆయన దగ్గర అయ్యారు అంటావ్ ఏంటి? నీతో నేను దగ్గరగా లేనా.? కాంతారావు గారు లేరా.? ఎవరు లేరు నీతో అని సమాధానం చెప్పారు అంట.నీతో ఉన్నట్లయితే సినిమాపరంగా ఉంటారు.లేదంటే నీతో కాలక్షేపం కోసం ఉంటారు.అంత మాత్రాన నీతో ఉన్న వాళ్లందర్నీ పెళ్లి చేసుకుంటావా ఏంటి.? దానికి సిద్ధమైతే చెప్పు అని అన్నారంట.ఒక గంట టైం ఇస్తున్నాను.
రామారావు గారి కంటికి కనిపించకుండా నువ్వు ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో.లేదు ఇక్కడే ఉంటాను, ఆయనతోనే ఉంటాను అంటావా చెప్పు నిన్ను చంపేసి నేను చచ్చిపోతా అన్నారంట.
ఆ మాటలు విన్న కృష్ణ కుమారి భయపడిపోయి పెట్టె, బేడా అన్ని తీసుకుని కార్ లో బెంగళూరు వెళ్లి పోయింది అంట అప్పట్లో.ప్రపంచమంతా ఏమనుకున్నా పర్వాలేదు కానీ తన తమ్ముడు మాత్రం తనని నమ్మాలి అనుకున్నారు చిన్నాయన.తమ్ముడిని ఒప్పించాలి, మెప్పించాలి, నమ్మించాలి అన్నది ఒక్కటే ఆయన ఆలోచన.కృష్ణకుమారి బెంగళూరు వెళ్లిపోయిన తర్వాత రామారావు గారి దగ్గరికి వెళ్లారు అంట చిన్నాయన.ఆయన్ని చుసిన రామారావు గారు… ఏమండీ ఏంటి ఇంత లేట్ గానే వచ్చేది ముహూర్తం సమయం దాటిపోతుంది కదా అన్నారంట.నోరు ముయ్.
ముహూర్తం అంటావేంటి.బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నావా.
ఏమైంది నీకు? అసలు 12 మంది పిల్లలు పుట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ రెండో పెళ్లి చేసుకుంటావా…! మళ్లీ ఇప్పుడు నీకు పెళ్లి కావాల్సి వచ్చిందా అని మందలించారు అంట.దానికి బదులుగా రామారావు గారు మరి కృష్ణకుమారిగారు నాగురించి ఏమనుకుంటారో అని అన్నారంట.ఏమనుకోదు ఆవిడ ఇక్కడ లేదు బెంగళూరు కి వెళ్ళిపోయింది అని తిరిగి సమాధానం చెప్పారంట చిన్నాయన.కేవలం చిన్నాయన ఉండబట్టి ఆ కాలంలో రామారావు గారి పెళ్లి ఆగిపోయింది.
అయితే రామారావు గారి కృష్ణకుమారి గారు మధ్య ప్రేమ అనేది ఏమీ లేదు కానీ ఒకరి నొకరు ఇష్టపడ్డారు.ఇద్దరూ కలిసి సహజీవనం చేద్దాము అని అనుకున్నారు.
ఇందులో ఎవరిని తప్పు పట్టాల్సిన పనిలేదు.ఇద్దరు ఇష్ట పూర్వకంగానే సహజీవనం చేద్దామని అనుకున్నారు.
కానీ ఇలా జరిగిపోయింది.