‘ఎన్టీఆర్‌’ లో బాలయ్య లుక్‌పై లక్ష్మీ పార్వతి కామెంట్‌.. అయ్యో కొడుకు లాంటి వ్యక్తిని మరీ అంతమాట అనేసిందేంటి?  

  • ఎన్టీఆర్‌ సినీ కెరీర్‌ను చూపిస్తూ సాగిన ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’ చిత్రం ప్రేక్షకుల నుండి పాజిటివ్‌ టాక్‌ను, అభిమానుల నుండి హిట్‌ టాక్‌ను దక్కించుకుంది. మొత్తానికి ఎన్టీఆర్‌ కథానాయకుడు ఒక మోస్తరుగా ఆడటం ఖాయం అని తేలిపోయింది. ఈ సమయంలోనే లక్ష్మీ పార్వతి ఈ చిత్రంపై చాలా విభిన్నంగా స్పందించింది.

  • Lakshmi Parvathi Comments On NTR Kathanayakudu Movie-Director Krish Lakshmi Balakrishna Ntr

    Lakshmi Parvathi Comments On NTR Kathanayakudu Movie

  • ఎన్టీఆర్‌ విడుదల సందర్బంగా లక్ష్మీ పార్వతి స్పందన ఏంటా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. తిరుపతిలో ఎన్టీఆర్‌ సినిమా గురించి లక్ష్మీ పార్వతి విభిన్నంగా స్పందించి అందరి దృష్టిని ఆకర్షించింది.

  • Lakshmi Parvathi Comments On NTR Kathanayakudu Movie-Director Krish Lakshmi Balakrishna Ntr
  • ‘ఎన్టీఆర్‌’ సినిమా విడుదలపై లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ… నేను మామూలుగా అయితే సినిమాలు చూడను. టీవీల్లో వస్తే అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను, అంతే తప్ప నేను బయటకు వెళ్లి సినిమా చూడను. కాని ఎన్టీఆర్‌ గారి సినిమా కనుక, అదీ బాలకృష్ణ చేశాడు కనుక విమర్శించేందుకు అయినా చూస్తానంటూ లక్ష్మీ పార్వతి చెప్పుకొచ్చింది. ఈ చిత్రం గురించి ఇప్పటికే చాలా మంది ఫోన్‌ చేసి పలు రకాలుగా చెప్పారు. ఎవరేం చెప్పినా కూడా నేను చూసిన తర్వాత అసలు విషయం మీకు చెప్తాను అంది.

  • ఎన్టీఆర్‌ పాత్రకు బాలకృష్ణ నటించడమే సినిమాకు పెద్ద మైనస్‌. ఎందుకంటే ఎన్టీఆర్‌ హైట్‌ మరియు వెయిట్‌లో బాలకృష్ణ ఏమాత్రం సరిపోడు. అలాంటి వ్యక్తి పాత్రను చేసే సత్తా ఎవరికి ఉండదు. కనీసం ఆయన బాడీకి కుడి ఎడమ ఉన్న వారు చేసినా అంతో ఇంతో బాగుంటుంది. బాలకృష్ణ ఏమాత్రం ఎన్టీఆర్‌ పాత్రకు సరిపోలేదు, ఎంత మాత్రం ఆయన పాత్రకు బాలకృష్ణ న్యాయం చేయలేడంటూ వ్యాఖ్యలు చేసింది. ఎన్టీఆర్‌ పాత్రకు కనీసం డూప్‌గా కూడా బాలకృష్ణ పనికి రాడంది. హైట్‌ లేని వారు ఎన్టీఆర్‌ పాత్రకు అస్సలు సెట్‌ అవ్వరు అనేది తన అభిప్రాయం అంటూ లక్ష్మీ పార్వతి చెప్పుకొచ్చింది. ఎన్టీఆర్‌లో చూపించినవన్నీ కూడా పచ్చి అబద్దాలే. ఎన్టీఆర్‌ నిజమైన బయోపిక్‌ వర్మ లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ అని, ఆయన మాత్రమే ఎన్టీఆర్‌ జీవితాన్ని చూపిస్తాడని చెప్పుకొచ్చింది.