సీఎం జగన్ కి ఐడియా ఇచ్చిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ..!!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం వైజాగ్ స్టీల్ ప్లాంట్ చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే.పార్టీలకతీతంగా నాయకులు ఒకే వేదికపై వస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం సరైనది కాదని పునరాలోచించాలని కోరుతున్నారు.

 Lakshmi Narayana Given Idea To Ys Jagan  Ys Jagan, Lakshmi Narayana, Andhra Prad-TeluguStop.com

ఇలాంటి తరుణంలో సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ కూడా స్పందించారు.ఆంధ్రులకు స్టీల్ ప్లాంట్ ఎంతో సెంటిమెంట్ అని పేర్కొన్నారు.

ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అదేవిధంగా పార్టీలకతీతంగా మొత్తం ఎంపీలంతా కలిసి ప్రధాని మోడీని కలిస్తే బాగుంటుందని ఐడియా ఇచ్చారు.

విశాఖలో మీడియాతో ఇటీవల మాట్లాడిన ఆయన ఎంతోమంది ప్రాణ త్యాగాలతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అయిందని అటువంటిది ప్రైవేటు పరం చేయాలనే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచించడం సరైనది కాదని స్పష్టం చేశారు.

అదే విధంగా విశాఖ ప్లాంట్ నుంచి ప్రభుత్వ పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు.విశాఖ ఉక్కు కర్మాగారం తో స్థానిక ప్రజలకు ఎంతో సెంటిమెంట్ ముడిపడి ఉందని ప్రభుత్వం సెంటిమెంట్ ని గౌరవించాలని కోరారు.

మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీల ఎంపీలు కలిసి పోరాటానికి దిగితే.కేంద్రం ఖచ్చితంగా వెనక్కి తగ్గే అవకాశం ఉందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.

  మరి లక్ష్మీనారాయణ ఐడియా ని సీఎం జగన్ ఫాలో అవుతారో లేదో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube