మీ ఇంట్లో లక్ష్మీదేవికి సంబంధించి ఇటువంటి ఫోటోలు ఉంటే వెంటనే తీసేయండి.!ఎందుకో తెలుసా?   Lakshmi Devi Photos Importance     2018-10-27   09:42:14  IST  Sainath G

హిందువుల్లో చాలా మంది త‌మ‌కు అష్టైశ్వ‌ర్యాలు క‌ల‌గాల‌ని త‌మ‌కు ఇష్ట‌మైన ల‌క్ష్మీ దేవిని ప్రార్థిస్తుంటారు. ఎందుకంటే ధ‌నానికి ఆమే అధిప‌తి. ఎవ‌రికి ఐశ్య‌ర్యం సిద్ధించాల‌న్నా ఆమె అనుగ్ర‌హంతోనే అది జ‌రుగుతుంది. క‌నుకే చాలా మంది లక్ష్మిని ప్రార్థిస్తారు. అయితే చాలా మంది భ‌క్తులు త‌మ అనుకూల‌త‌లు, ఇష్టాల‌ను బ‌ట్టి వివిధ రూపాలు, ఆకారాలు, చిత్రాల్లో ఉన్న ల‌క్ష్మీ దేవి ప‌టాల‌ను, బొమ్మ‌ల‌ను పూజిస్తారు. కానీ మీకు తెలుసా..? కొన్ని ర‌కాల ల‌క్ష్మీదేవి చిత్ర ప‌టాల‌ను పూజిస్తే ధ‌నం రాద‌ట‌. పైగా ఉన్న ధ‌నం కూడా ఎలా వ‌చ్చిందో అలాగే పోతుంద‌ట‌. ఈ క్ర‌మంలో భక్తులు ఎలాంటి ప‌టాల‌ను, బొమ్మ‌ల‌ను పూజించాలో, ఎలాంటి వాటిని పూజించ‌కూడ‌దో ఇప్పుడు తెలుసుకుందాం.

1. గుడ్ల‌గూబ తెలుసుగా. దానిపై లక్ష్మీ దేవి కూర్చున్న‌ట్టుగా ఉండే బొమ్మ‌ను పూజించ‌కూడ‌ద‌ట‌. దీంతో అంతా అశుభ‌మే జ‌రుగుతుంద‌ట‌. ధ‌నం వ‌చ్చింది వ‌చ్చిన‌ట్టు పోతుంద‌ట‌.

2. తామ‌ర పూవుపై ల‌క్ష్మీదేవి నిలుచుని ఉన్న ఫొటో కాకుండా కూర్చున్న‌ట్టుగా ఉన్న ఫొటోను పూజించాల‌ట‌. దీంతో అంతా శుభ‌మే జ‌రుగుతుంద‌ట. ఐశ్వ‌ర్యం సిద్ధిస్తుంద‌ట‌.

Lakshmi Devi Photos Importance-

3. గ‌రుత్మంతునిపై విష్ణువుతోపాటు ల‌క్ష్మీ దేవి కూర్చుని ఉన్న ఫొటోను పూజించినా మిక్కిలిగా ధ‌నం ల‌భిస్తుంద‌ట‌. అంతా మంచే జరుగుతుంద‌ట‌.

Lakshmi Devi Photos Importance-

4. శేష‌త‌ల్పంపై విష్ణువు ప‌డుకుని ఉండ‌గా, ఆయ‌న కాళ్ల వ‌ద్ద లక్ష్మీ దేవి ఉన్న బొమ్మ‌ను పూజిస్తే అలాంటి వారి దాంప‌త్య జీవితం సుఖ‌మయంగా సాగుతుంద‌ట‌.

Lakshmi Devi Photos Importance-

5. కుబేరుని విగ్ర‌హం లేదా ఫొటోను ఇంట్లో పెట్టుకుంటే దాంతో ల‌క్ష్మీ దేవి సంతృప్తి చెంది ఆ ఇంట్లోని వారికి ఐశ్వ‌ర్యాల‌ను క‌లిగిస్తుంద‌ట‌.

Lakshmi Devi Photos Importance-

6. పాద‌ర‌సంతో త‌యారు చేసిన ల‌క్ష్మీ దేవి విగ్ర‌హాన్ని పూజిస్తే దాంతో అన్నీ శుభాలే క‌లుగుతాయ‌ట‌. ధ‌నం కూడా బాగా స‌మ‌కూరుతుంద‌ట‌.

Lakshmi Devi Photos Importance-

7. దీపావళి రోజున స్ఫ‌టిక శ్రీ‌యంత్రాన్ని ఒక ఎర్ర‌ని వ‌స్త్రంలో చుట్టి దాన్ని మీ మ‌నీ లాక‌ర్‌లో పెట్టాలి. దీంతో ఆ ఇంట్లో అంతా శుభ‌మే జ‌రుగుతుంది.

Lakshmi Devi Photos Importance-

8. ల‌క్ష్మీ పూజ చేసేట‌ప్పుడు తుల‌సి ఆకులు, ధూపం, దివ్వెలు, పూవుల‌ను ఎక్కువగా వాడి పూజ చేయాల‌ట‌. దీంతో అనుకున్న‌ది జ‌రుగుతుంద‌ట‌.

Lakshmi Devi Photos Importance-

9. దీపావళి రోజున ల‌క్ష్మీ దేవి, కుబేరున్ని పూజించి అనంత‌రం ఈ మంత్రాన్ని 108 సార్లు ప‌ఠించాలి. దీని వ‌ల్ల భక్తులకు అనుకున్న‌ది నెర‌వేరుతుంద‌ట‌.

ఓం య‌క్షాయ కుబేరాయ వైశ్ర‌వ‌ణాయ ధ‌న‌ధాన్యాధిప‌త‌యే ధ‌న‌ధాన్య‌స‌మృద్ధిం మే దేహి దాప‌య స్వాహా