ఈ రెండు మేక‌ల‌కు ల‌క్ష‌లు..అస‌లు క‌థేంటంటే...!

బక్రీద్ సందర్భంగా ఎక్కువ మంది ముస్లింలు జంతువధ చేస్తుంటారు.చాలా మంది జంతు ప్రేమికులు ఇది వ్యతిరేఖిస్తూ వస్లున్నప్పటికీ ముస్లింలు బక్రీద్ ను పురస్కరించుకుని చేసే జంతు వధ మాత్రం ఆగడం లేదు.

 Lakhs For These Two Goats The Original Story Is-TeluguStop.com

తమకు ఉన్నంతలో పండుగను ఘనంగా చేసుకోవాలని చాలా మంది చూస్తుంటారు.ఇక ఓచోట మాత్రం మేకలకు కళ్లు చెదిరే ధర వచ్చింది.

ఏకంగా ఆ మేకలకు నాలుగున్నర లక్షల ధర పలకడంతో అందరూ విస్తుపోయారు.

 Lakhs For These Two Goats The Original Story Is-ఈ రెండు మేక‌ల‌కు ల‌క్ష‌లు..అస‌లు క‌థేంటంటే…-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సంఘటన జరిగింది యూపీ రాజధాని లక్నోలో.గోమతి నదీ తీరాన ఉన్న ఓ మేకల మార్కెట్ అమ్మకానికి ఉంచిన రెండు మేకలను ఓ వ్యక్తి ఏకంగా నాలుగున్నర లక్షలు వెచ్చించి కొనుగోలు చేశాడు.

అసలు అంతలా ధర పెట్టేందుకు కారణం ఏంటా అనే అనుమానం అందరికీ కలుగుతుంది.వాటిల్లో ఒకటి 170 కిలోలు ఉంటే, మరోటి 150 కిలోల బరువుంది.

ఇవి ఇంతలా బరువు పెరిగేందుకు కారణం అవి తినే ఆహారం.వాటి యజమాని వాటికి రోజూ 600 రూపాయల విలువ గల ఆహారం పెడతాడట.

బాదాం, పిస్తా ఇలా అనేక రకాల హెల్తీ ఐటమ్స్ తో పాటు జ్యూసులు కూడా తాగిస్తారట.అంతే కాకుండా వీటికి రోజు స్నానం కూడా చేపిస్తామని వీటిని పెంచిన వారు చెప్పారు.

Telugu 14.8 Laks, 150 Kg . And 170 Kg, And Pista, Badam, Goats, High Price, Lakno, Two Goats, Up State-Latest News - Telugu

సంక్రాంతికి పందెం కోళ్లను పెంచడం తెలుగు వారు ఇప్పటికే చాలా సార్లు చూసి ఉంటారు.కానీ ఇలా మేకలను పెంచడం తో ఏంటా ఇది అని ఆశ్చర్యపోతున్నారు.వీటికి తినిపించే ఆహారం కూడా సేమ్ పందెం కోళ్లకు తినిపించే ఆహారం మాదిరే ఉండడం విశేషం.ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ మరీ అంతలా ధర పెట్టాలా అని దీర్ఘాలు తీస్తున్నారు.

రోజుకు 600 రూపాయల ఆహారం తినే మేకలకు ఆ మాత్రం ధర పలకడం సబబే అని కొంత మంది అంటున్నారు.

#Pista #Badam #Lakno #Goats #Kg Kg

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు