దండ వేసేందుకు పైకి ఎత్తుకున్నందుకు పెళ్ళిలో లాగి పెట్టి కొట్టిన వధువు.! వైరల్ అవుతున్న వీడియో.!       2018-07-05   02:55:21  IST  Raghu V

పెళ్ళిలో వదువరులు దండాలు మార్చుకోవడం సర్వ సాధారణం. హైట్ సరిపోకపోతే అబ్బాయి కిందకి వంగడం లేదా అమ్మాయి స్టూల్ ఎక్కడం కూడా కామన్. ఇటీవలే వచ్చిన ఫిదా సినిమాలో వరుణ్ తేజ్ అన్నకు పెళ్లి జరుగుతున్నప్పుడు భాను అక్కకు దండ వేయడానికి హైట్ సరిపోకపోతే వదినను వరుణ్ ఎత్తుకుంటాడు. కానీ అది సినిమా కాబట్టి ఏం కావాలి. నిజ జీవితంలో మాత్రం అలా ఎత్తుకుంటే చెంప దెబ్బ రుచి చూడాల్సి వస్తుంది. ఎక్కడ జరిగిందో తెలియదుగానీ, నిన్న సోషల్ మీడియాలో పోస్టు చేయబడిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ వీడియోలో పెళ్లి వేడుక జరుగుతుంది.. ముహూర్తం దగ్గర పడే సమయంలో వధువు, వరుడు దండలు మార్చుకునేందుకు నిలబడ్డారు.

వాళ్ళ ఆచారం ప్రకారం వరుడిని, వధువుని వారి బంధువులు ఎత్తుకుని దండలు మార్పించాలి.. దీనిలో భాగంగా వరుడి తరపు బంధువు అతన్ని ఎత్తుకుని వధువు మెడలో దండ వేయించాడు.. ఇప్పుడు వధువు వంతు వచ్చింది. ఆమె తరపు బంధువు పైకి ఎత్తుకుని దండ వేయించాడు. దండ వేసి కిందకి దిగిన వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా తనను ఎత్తుకున్న బంధువును లాగి ఒకటి పీకింది ఆ పెళ్లికూతురు.అంతటితో ఆగకుండా నాలుగు తిట్లు తిట్టింది. నలుగురి ముందు తనకు జరిగిన అవమానానికి బాగా ఫీలయిన ఆ వ్యక్తి.. పక్కనే ఉన్న మరో యువతిని లాగి కొట్టి.. అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వైరల్ అవుతున్న ఈ వీడియో మీరు ఒక లుక్ వేయండి !

ఎవరైనా చెంప దెబ్బకొడితే, ఎంత అవమానంగా ఉంటుంది? అది కూడా ఓ పెళ్లి మండపంలో నలుగురి ముందూ వధువు కొడితే… అంతకన్నా అవమానం ఇంకోటి ఉంటుందా?