లగడపాటి సర్వే అసలు లెక్కేంటి! టీడీపీ గెలవబోతుంది అని చెప్పినట్లే కదా  

లగడపాటి సర్వే తెలియాలంటే మే 19 వరకు ఆగాల్సిందే. .

Lagadapati Survey Will Announce May 19-

ఎన్నికలలో కచ్చితమైన సర్వేలతో రాజకీయాలకి అతీతంగా ఎప్పుడు హాట్ టాపిక్ అయ్యే వ్యక్తి లగడపాటి రాజగోపాల్. తెలంగాణా ఎన్నికల ముందు వరకు లగడపాటి సర్వే అంటే కచ్చితంగా అది వాస్తవం అవుతుంది అని అందరూ నమ్మేవారు. అయితే తెలంగాణ ఎన్నికలలో లగడపాటి సర్వేకి విరుద్ధంగా ఎన్నికల ఫలితాలు రావడంతో సోషల్ మీడియాలో అతనిని ఫుల్ గా ట్రోల్ చేసి పారేశారు..

లగడపాటి సర్వే అసలు లెక్కేంటి! టీడీపీ గెలవబోతుంది అని చెప్పినట్లే కదా-Lagadapati Survey Will Announce May 19

దీంతో దెబ్బకి దెయ్యం దిగి వచ్చ్చి తరువాత ప్రెస్ మీట్ పెట్టి తన సర్వే రిపోర్ట్ పై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసారు. ఇక ఏపీ అసెంబ్లీ ఎన్న్నికలలో కూడా ఎవరు గెలవబోతున్నారు అనే విషయంపై లగడపాటి ఇప్పటికే సర్వే చేసినట్లు టాక్ వినిపిసస్తుంది.

సర్వే ఫలితం గురించి లగడపాటి నేరుగా చెప్పకపోయిన ఏపీ ప్రజలు అభివృద్ధికి, సంక్షేమానికి మళ్ళీ పట్టం కట్టబోతున్నారు అంటూ తెలుగు దేశం పార్టీ గెలవబోతుంది అనే పరోక్షంగా చెప్పారు.

మరో వైపు గోదావరి, విశాఖ జిల్లాలలో జనసేన ప్రభావం భారీ గా ఉండబోతుంది అని కూడా లగడపాటి చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో వచ్చే నేల 19 ప్రకటించనున్న లగడపాటి సర్వే ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.