లగడపాటి సర్వేను నమ్మినందుకు వారు కోట్లల్లో నష్టపోయారు.. ఒక రైతు తన 10 ఎకరాల భూమిని కోల్పోయాడు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజా కూటమి గెలుస్తుందని లగడపాటి రాజగోపాల్‌ చెప్పిన విషయం తెల్సిందే.కాంగ్రెస్‌ మరియు టీడీపీలు కలవడంతో ప్రజా కూటమి బలం అనూహ్యంగా పెరిగిందని, ఇదే సమయంలో కేసీఆర్‌ పై ఉన్న వ్యతిరేకత ప్రజా కూటమికి కలిసి వస్తుందని లగడపాటి ఏదో ఏదో ఊహాగాణాలు చేసి, సర్వే చేశానంటూ చెప్పి ప్రజా కూటమిని తన సర్వేలో విజేతగా ప్రకటించాడు.

 Lagadapati Survey Telangna Elections Meant For Only Betting1-TeluguStop.com

అయితే ఇతర జాతీయ మీడియా సంస్థలు అన్ని కూడా ఖచ్చితంగా టీఆర్‌ఎస్‌ గెలుస్తుందని చెప్పాయి.

తెలుగు రాష్ట్రంలో జాతీయ మీడియా ఎగ్జిట్‌ ఫోల్స్‌ ఫలితాలు పెద్దగా నమ్మనక్కర్లేదని, లగడపాటి సర్వేకే ఎక్కువ ఛాన్స్‌ ఉందని అంతా అన్నారు.లగడపాటి సర్వే ప్రకారం ప్రజా కూటమి స్వష్టమైన ఆధిక్యంతో ప్రభుత్వంను ఏర్పాటు చేస్తుందని అంతా భావించారు.లగడపాటి అంతకు ముందు వరకు చేసిన సర్వేలన్నీ కూడా దాదాపుగా నిజం అయ్యాయి.

అందుకే ఈసారి లగడపాటి సర్వేలను నమ్ముకుని ఆంధ్రాలో భారీగా బెట్టింగ్‌లు కాశారు.

లగడపాటి సర్వేపై పూర్తి నమ్మకం ఉంచిన గుంటూరుకు చెందిన ఒక రైతు ఏకంగా 10 ఎకరాల పొలంను బెట్‌ కాశాడు.ప్రజా కూటమి తెలంగాణలో అధికారంలోకి వస్తుందంటూ ఆయన నమ్మకంగా 10 ఎకరాల భూమిని బెట్టింగ్‌లో కాయగా మొత్తం పోయింది.ప్రకాశం జిల్లా కారంచేడుకు చెందిన ఒక వ్యక్తి ప్రజా కూటమి గెలుస్తుందని 5 ఎకరాల భూమిని పందెం కాశాడు.

అదే జిల్లాకు చెందిన మరో వ్యక్తి ఏకంగా ప్రజా కూటమి గెలుస్తుందని పందెం కాసి 90 లక్షలను కోల్పోయాడు.అయితే ప్రకాశం జిల్లాకు చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే మాత్రం టీఆర్‌ఎస్‌ పూర్తి ఆధిపత్యంను కొనసాగించి అధికారంను దక్కించుకుంటుందని పందెం కాసి ఏకంగా 10 కోట్ల గొపొందాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube