లగడపాటి చెప్పింది నిజమేనా ?  

Lagadapati Survey Tdp To Win In Ap Assembly Polls-

ఎగ్జిట్ పోల్స్ సందడి ఏపీలో ఈ రోజు నుంచి మొదలు కాబోతోంది.ఎవరికి వారు తాము చేసిన సర్వే రిపోర్ట్స్ ను జనాల మీదకు వదిలేయడం స్టార్ట్ చేస్తారు.అంతేకాదు 23 వ తేదీన ఫలితం ఎలా ఉండబోతుంది అనే విషయం కూడా నేడు సూచాయగా తేలిపోనుంది.అందుకే అందరు కౌంటింగ్ తేదీ రోజున వచ్చే ఫలితం కోసం ఎంత టెన్షన్ పడుతున్నారో అంతే టెన్షన్ నేడు విడుదలయ్యే ఎగ్జిట్ పోల్స్ మీద కూడా పడుతున్నారు...

Lagadapati Survey Tdp To Win In Ap Assembly Polls--Lagadapati Survey TDP To Win In AP Assembly Polls-

ఒక్కో సర్వే సంస్థ ఒక్కో విధమైన సర్వే రిపోర్ట్ ను బయటపెట్టబోతున్నాయి.అన్నిటికంటే అందరూ ఆసక్తిగా ఎదురుచూసే సర్వే రిజల్ట్ మాత్రం ఆంధ్ర ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ సర్వేనే.ఆయన ఏపీలో ఎవరు గెలవబోతున్నారని చెబుతారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఏపీలో ఎవరు అధికారం చేపట్టబోతున్నారు అనే విషయంపై నిన్ననే క్లారిటీ ఇచ్చేసారు లగడపాటి.ఈరోజు సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన లగడపాటి తెలుగు రాష్ట్రాల్లో ఎవరు గెలుస్తారో చెప్పకనే చెప్పారు.ఏపీలో తెలుగుదేశం పార్టీ, తెలంగాణలో మెజార్టీ లోక్ సభ సీట్లు టీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటుందని చెప్పకనే చెప్పారు.

Lagadapati Survey Tdp To Win In Ap Assembly Polls--Lagadapati Survey TDP To Win In AP Assembly Polls-

అంతే కాదు ఇక రేపు (19 వ తేదీ) తిరుపతిలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో చెబుతానని కూడా లగడపాటి చెప్పారు.తెలంగాణలో అధిక బడ్జెట్ ఉంది కాబట్టి అక్కడ కారు ప్రయాణాన్నే కోరుకున్నారని, ఏపీలో లోటు బడ్జెట్ ఉంది కాబట్టి, ఇక్కడున్న పరిస్థితుల్లో టీడీపీ నే ప్రజల ఆప్షన్ గా కనిపించిందని లగడపాటి జోస్యం చెప్పారు.

అయితే ఆయన మాటల్లో ఎంత విశ్వసనీయత ఉందో తెలియదు కానీ లగడపాటి మాటలకు మాత్రం తెలుగు తమ్ముళ్లలో జోష్ అయితే బాగా పెరిగింది.ఈ రోజు లగడపాటి వెల్లడించే సర్వే ప్రకారం తెలుగుదేశం పార్టీకి 105-110 సీట్లు రావొచ్చని అంచనా వేస్తున్నారు.ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకైతే సుమారు 60 నుంచి 65 స్థానాలు వచ్చే అవకాశం ఉందట.అలాగే రాజకీయాల్లోకి తొలిసారిగా అడుగుపెట్టిన పవన్ పార్టీ జనసేన 4-5 సీట్లు గెలుస్తుందని లగడపాటి సర్వేలో తేలినట్టు ప్రచారం జరుగుతోంది.ఏదైతేనేమి ఈ రోజు లగడపాటి విడుదల చేసే సర్వే రిపోర్ట్ ఎలా ఉండబోతోంది అనే ఆతృత అందరిలోనూ కలుగుతోంది.